కాజల్ మాటే.. రత్నవేలు మాట

Update: 2017-01-22 09:27 GMT
ఎంతైనా స్ట్రెయిట్ సినిమాతో వచ్చేంత పేరు.. రీమేక్ మూవీతో రాదు. ఎంత పనితనం చూపించినా జనాలు దానికి తగ్గ క్రెడిట్ ఇవ్వరు. అందుకే రీమేక్ సినిమాల్లో పని చేయడానికి కొందరు అంతగా ఆసక్తి చూపించరు. స్టార్ కెమెరామన్ రత్నవేలు కూడా ఆ కేటగిరీకే చెందుతాడు. అతను చిరంజీవి రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’లో పని చేయడానికి అంతగా ఇష్టపడలేదట. ఐతే చిరంజీవి సినిమా అన్న ఒకే ఒక్క కారణంతో దీనికి పని చేసినట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు రత్నవేలు.

తనకు రీమేక్ సినిమాల్లో పని చేసే విషయంలో ఎంతమాత్రం ఆసక్తి లేదని.. ఇందులో మన ముద్రంటూ చూపించడానికి అవకాశం ఉండదని.. ఐతే చిరంజీవి కోసం అడిగారని ఆ అవకాశాన్ని కాదనలేకపోయానని రత్నవేలు తెలిపాడు. చిరంజీవితో పని చేయడం గొప్ప అనుభవమని.. ఆయన్ని బాగా చూపించానని అందరూ అంటుండటం ఆనందాన్నిస్తోందని రత్నవేలు అన్నాడు.

రత్నవేలు కంటే ముందు కాజల్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేయడం విశేషం. ‘కత్తి’ సినిమాలో కథానాయికకు చెప్పుకోదగ్గ పాత్రేమీ లేదని తెలిసినా.. తాను ఈ పాత్ర చేస్తే గొప్ప పేరేమీ రాదని అర్థమైనా.. చిరంజీవి పక్కన నటించవచ్చన్న ఒకే ఒక్క కారణంతో ఈ సినిమా ఒప్పుకున్నట్లు ఆమె చెప్పింది. ఆయన కాకపోతే ఈ సినిమా ఒప్పుకునేదాన్నని అంది. బహుశా దర్శకుడు వినాయక్ ఫీలింగ్ కూడా ఇలాగే ఉండొచ్చు. రీమేక్ కావడంతో ఈ సినిమా వల్ల అతడికి పెద్దగా ప్రయోజనమేమీ దక్కలేదు. అతను కూడా చిరు కోసమే ఈ సినిమా చేశాడనుకోవచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News