సినిమాలో నటించా కాని కథ తెలీదు -కాజల్

Update: 2018-02-15 10:11 GMT

టాలీవుడ్ లో నేచురల్ స్టార్ నాని ఒక స్టార్ హీరోగా, చందమామ కాజల్ స్టార్ హీరోయిన్ గా అందరికి తెలుసు. ఇద్దరి కలిసి ఇన్నేళ్ళకి ఒక సినిమాకి కలిసి పని చేశారు. హీరో హీరోయిన్లుగా కాదులెండి. నాని 'అ' అనే సినిమాకు నిర్మాతగా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కాజల్ ముఖ్య పాత్ర పోషించింది. కలిసి స్క్రీన్ పై కనపడకపోయిన వారిద్దరి మధ్య బంధం గురించి చెప్పుకొచ్చింది కాజల్.

"నేను - నాని ఎప్పుడు పెద్దగా కలుసుకోలేదు. బయట పార్టీల్లో కూడా మేం ఒకసారి మాత్రమే కలిసినట్టున్నాం. అప్పుడు కూడా పెద్దగా మాట్లాడుకోలేదు. మా ఇద్దరి మైండ్ సెట్ ఒకటే అవ్వడం వల్ల ఎమోషనల్ గా మేము చాలా క్లోజ్ అయ్యాం. మా ఇద్దరికీ పని ఒక్కటే లోకం. ఒకరి లైఫ్ స్టయిల్ ఏంటో మరొకరికి బాగా తెలుసు." అంటోంది కాజల్. విచిత్రం ఏమిటంటే 'అ!' సెట్స్ పైన కూడా నాని కాజల్ ను ఒకసారి మాత్రమే పలకరించాడంట. "మొదటి రోజు కాజల్ సెట్స్ పైకి వచ్చినప్పుడు నేను తనకు వెల్ కం చెప్పాను. అంతే.. ఆ తర్వాత కాజల్ ను కలవలేదు. 'అ!' మూవీ ఫంక్షన్ లో మళ్ళీ కలవడమే తప్ప మళ్లీ సెట్స్ పై ఎప్పుడు చూడలేదు కూడా. నిజానికి ఈ సినిమాకు కాజల్ కేవలం 5 రోజులు కాల్షీట్లు ఇచ్చింది. అందులో ఒకరోజు మాత్రమే మేం కలుసుకున్నాం." అంటూ అసలు విషయం చెప్పాడు నాని.

ప్రమోషన్ల పనిమీద గట్టిగా తిరిగేస్తున్న వీరిద్దరూ బోలెడు ఆసక్తికర విషయాలు చెప్తున్నారు. విచిత్రం ఎంతో తెలుసా? వీరిద్దరికి కథ ఎంటో పూర్తిగా తెలియదు అంట. అసలు క్లైమాక్స్ లో ఏమవుతుంది అనేది వీళ్ళకి క్లారిటీ ఏ లేదంట. మా పాత్రలు వరకు మేం పోషించేసాం కానీ కథపై పూర్తి అవగాహన లేదు అంటూ ప్రేక్షకులను షాక్ కు గురి చేశారు మన నాని అండ్ కాజల్.
Tags:    

Similar News