సెల్ఫీ మేళాతో బిస్కెట్లేస్తున్న కాజల్

Update: 2017-07-27 12:51 GMT
అసలే ఒకప్పుడు స్టార్ హీరోయిన్. ఏదో ఇప్పుడు రిలేషన్ కోసం కొంతమంది చిన్న హీరోలతో సినిమాలు చేసింది. మరి పెద్ద హీరోలేమో పిలవట్లేదు. ఈ సమయంలో ఏం చేయాలి చెప్పండి? అందరితో చక్కగా సవ్యంగా టచ్ లో ఉంటే.. ఎప్పుడో ఎవరో ఒకరు ఖచ్చితంగా పిలుస్తారు. ఇప్పుడు ఇవన్నీ అచ్చం ఇలాగే పాటించేస్తోంది చందమామ కాజల్ అగర్వాల్. తన పరువాలతో ఆకట్టుకుంటున్న ఈ సీనియర్ హీరోయిన్ ఇప్పుడు దర్శకులకూ ప్రొడ్యూసర్లకు హీరోలకు చక్కగా బిస్కెట్లు వేస్తోంది అంటున్నారు నెటిజన్లు.

అదిగో దర్శకుడు వంశీ పైడిపల్లి పుట్టినరోజు అనగానే.. హ్యాపీ బర్తడే వామ్స్.. అంటూ అతగాడితో గతంలో 'ఎవడు' సినిమా టైములో దిగిన ఒక సెల్ఫీ అనుకుంట.. అది షేర్ చేసింది. ఆ తరువాత కృష్ణవంశీ పుట్టినరోజు సందర్భంగా.. ఆల్రెడీ ఆయన డైరక్షన్లో చందమామా.. గోవిందుడు అందరివాడేలే తదితర సినిమాలు చేసిన కాజల్.. ఆయనతో కూడా ఎప్పుడో దిగిన సెల్ఫీ ఒకటి ఉంటే.. దానిని కూడా బయటేసి వెషెస్ చెప్పేసింది. గతంలో ఎప్పుడూ ఇలా ఓపెన్ అవ్వని కాజల్.. సడన్ గా ఇలా సెల్ఫీ మేళ పెట్టి విషెస్ చెబుతుంటే.. ప్రేమతో చెబుతున్నా కూడా అవి బిస్కెట్లు వేస్తున్నట్లే అనిపిస్తోంది మరి.

ఇకపోతే తెలుగులో నేనే రాజు నేనే మంత్రి సినిమా రిలీజ్.. తమిళంలో అజిత్ వివేగం.. విజయ్ కొత్త సినిమాలు రిలీజ్ కు రెడీ అయిపోవడంతో కాజల్ బాగా హ్యాపీగా ఉంది. కనీసం ఈ సినిమా సక్సెస్ లు అయినా ఈ సీనియర్ హీరోయిన్ కెరియర్ కు బాగా బూస్ట్ ఇస్తాయనేది ఒక ఆశ అయితే.. ఇంతలో ఇలా విషెస్ పేరుతో వేస్తున్న బిస్కెట్లు కూడా ఫలించి ఏమన్నా ఛాన్సులు వస్తే ఇంకా మంచిదే!!
Tags:    

Similar News