టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫాం చేసేసింది. కొన్ని రోజులుగా వస్తున్న వార్తలను ధృవీకరిస్తూ ఓ ఫోటోను నెట్ లో షేర్ చేసింది. గత కొద్దికాలంగా.. కాజల్ చెల్లెలు.. టాలీవుడ్ హీరోయిన్ అయిన నిషా అగర్వాల్ ప్రెగ్నెన్సీ దాల్చిందనే వార్తలు మీడియాలో వస్తున్నాయి. అయితే.. వీటిపై ఇప్పటివరకూ ఎలాంటి ధృవీకరణ లేదు.
ఏమైంది ఈ వేళ.. సోలో.. సుకుమారుడు వంటి చిత్రాలలో నటించిన కాజల్ సోదరి.. 2013లోనే పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. బిజినెస్ మ్యాన్ కరణ్ ను వివాహమాడిన నిషా అగర్వాల్.. కొద్ది నెలల క్రితం గర్భం దాల్చింది. ఇప్పుడు కాజల్ ఆ విషయాన్ని ఓ పిక్ ద్వారా కన్ఫాం చేసింది. గర్భంతో పెరిగిన కడుపుతో నిషా అగర్వాల్ నుంచుని ఉండగా.. ఒకవైపు నుంచి అక్క కాజల్ అగర్వాల్.. మరోవైపు నుంచి భర్త కరణ్ వేలేచ్చలు.. ఆమె ఉదరంపై చేతులు వేసి తమ ఆనందాన్ని ప్రకటిస్తున్నారు. కడుపుతో ఉన్న విషయాన్ని ధృవీకరించడంతో పాటు.. తమ ఆనందాన్ని ప్రకటించేందుకు ఇంతకంటే బెస్ట్ ఆఫ్షన్ ఉండదేమో.
నిర్వచించలేనంత ఎక్సైట్ మెంట్ అంటూ కాజల్ అగర్వాల్ హ్యాష్ ట్యాగ్ పెట్టిందంటే.. తన చెల్లికి బిడ్డ పుడుతున్న ఆనందాన్ని చందమామ ఎంతగా ఎంజాయ్ చేస్తోందో అర్ధమవుతుంది.