టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ చాలాకాలంగా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉంది. ఈ మధ్య కాలంలో ఆమె జోరు కాస్త తగ్గినా తిరిగి మళ్లీ స్పీడందుకుంది. కెరీర్ లో కమర్షియల్ సినిమాలే ఇంతవరకు చేస్తూ వచ్చిన ఆమె తొలిసారి అ! సినిమాలో వైవిధ్యమైన పాత్ర చేసింది. నాచురల్ స్టార్ నిర్మించిన ఈ సినిమాలో కాజల్ చేసిన కలి పాత్ర విమర్శకులను సైతం మెప్పించింది.
అ! సినిమాలో కలి పాత్ర కోసం తాను బోలెడు బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేశానని చెప్పుకొచ్చింది కాజల్. ఇందులో ఆమెది మానసికంగా స్థిరత్వం లేని పాత్ర. ఈ పాత్ర చేయడానికి ముందు సైకాలజిస్టును కలిసి కొన్ని సలహాలు కూడా తీసుకున్నానని అంటోంది కాజల్. ‘‘మానసికంగా జీవితంలో దెబ్బతిన్న వారు ఎలా ఉంటారు.. బయట అందరి ముందు వారి ప్రవర్తన ఎలా ఉంటుందనే దాని గురించి చాలా స్టడీ చేశాను. మనదేశంలో మానసిక ఉద్వేగాలు.. సంఘర్షణ అంత సీరియస్ గా తీసుకోరు. అందుకే అవి బయటపడకుండా అలాగే ఉండిపోతాయి. ఈ సినిమాలో నేనే కాదు.. అంతా చాలా కష్టపడ్డారు. ఇందులో నా పాత్ర బాగుందని అంతా అంటుంటే చాలా హ్యాపీగా ఉంది’అని చెప్పుకొచ్చింది కాజల్.
‘‘కొత్త తరంలో డైరెక్టర్లు సరికొత్త ఆలోచనలతో ముందుకొస్తున్నారు. వాళ్లకు భారతీయ సినిమా భవిష్యత్తు ఎలా ఉంటుందనే దానిపై స్పష్టమైన అవగాహన ఉంది. అ! అర్జున్ రెడ్డి సినిమాలు చేయడానికి నేనెప్పుడూ సిద్ధంగానే ఉంటాను. హిందీలో రాణించలేకపోయానన్న దిగులు నాకెప్పుడూ లేదు. తెలుగు.. తమిళం లాగే అది కూడా ఓ భారతీయ భాష అందే. సౌత్ లో హీరోయిన్ గా నేనున్న స్థానం నాకెప్పుడూ ప్రత్యేకమే’’ అంటూ కాజల్ తన భవిష్యత్ ప్రాధాన్యాలను వివరించింది.