కథ బావుంటే హీరోయిన్స్ కూడా బ్లాక్ బస్టర్స్ కొట్టగలరని నిరూపించిన సినిమా క్వీన్. కంగనా రనౌత్ లీడ్ రోల్ లో 2014 లో బాలీవుడ్ లో వచ్చిన "క్వీన్" సినిమా ఆమెకు మంచి పేరుని తెచ్చి పెట్టడమే కాకుండా మంచి బాక్స్ ఆఫీస్ హిట్ ను కూడా అందించింది ఆ చిత్రం. కేవలం 12 కోట్లతో తెరకెక్కించిన ఆ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని 100 కోట్లని కొల్లగొట్టి బాలీవుడ్ ప్రముఖ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
అయితే అంతటి విజయాన్ని సాధించిన సినిమాను ఇప్పుడు సౌత్ లో తెరకెక్కించబోతున్నారట ఆ చిత్ర యూనిట్ సభ్యులు. గత కొంత కాలంగా ఈ రీమేక్ సినిమాలో తమన్నా - అమలాపాల్ పేర్లు బాగా వినిపించాయి. కానీ ఫైనల్ గా ఆ అదృష్టం సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ కి దక్కింది. ఈ సినిమాను తెలుగు - తమిళ్ లో ఒకేసారి చిత్రీకరించనున్నారట. అంతే కాకుండా ఇక్కడి ప్రేక్షకుల అభిరుచి కి తగ్గట్టు కథలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయని తెలుస్తోంది. ఇక ఇప్పటికే 50 సినిమాలను పూర్తి చేసుకున్న కాజల్ రీసెంట్ గా నేనే రాజు నేనే మంత్రి మరియు వివేగం సినిమాలతో మంచి పేరును తెచ్చుకుంది. ఇక క్వీన్ రీమేక్ సినిమాతో తనే లీడ్ రోల్ లో కథను నడిపించడానికి సిద్ధమైపోయింది. మరి లో కంగన స్థాయిలో కాజల్ మెప్పిస్తుందా లేదా చూడాలి.
ప్రస్తుతం కాజల్ నేనే రాజు నేనే మంత్రి సినిమా సక్సెస్ ను బాగానే ఎంజాయ్ చేస్తోంది. అలాగే వివకేం సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా కాజల్ రోల్ కు మంచి టాకే వచ్చింది.