ఎనిమిదేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో జర్నీ చేస్తున్నా కాజల్ ఎప్పుడూ హద్దులు దాటింది లేదు. తెరపై పద్ధతిగా కనిపించడానికే ప్రాధాన్యమిచ్చింది. అదే సమయంలో కమర్షియల్ హీరోయిన్ అనే పేరు తెచ్చుకొంది. అలా హద్దుల్లో కనిపిస్తూ కమర్షియల్ హీరోయిన్ అనిపించుకోవడం చాలా కష్టం. కానీ కాజల్ మాత్రం అదే నా ప్రత్యేకత అంటోంది. అయితే కొద్దిమంది మాత్రం కాజల్ బిజినెస్ మేన్ సినిమాలో మహేష్ కి ముద్దిచ్చింది కదా అని చెబుతుంటారు. అందరూ అనుకొంటున్నట్టు అదేమీ నిజమైన ముద్దు కాదు. ఉత్తిత్తి ముద్దే. టెక్నికల్ జిమ్మిక్కులతో అలా ముద్దు సన్నివేశం చేసినట్టు చూపించారు. కానీ ఈసారి మాత్రం మహేష్ కి కాజల్ నిజంగానే ముద్దివ్వబోతోందట. ఇటీవల తన అంగీకారం కూడా తెలిపిందని ప్రచారం సాగుతోంది.
మహేష్ కథానాయకుడిగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం తెరకెక్కుతోంది. ఇందులో ముగ్గురు కథానాయికలున్నారు. అందులో కాజల్ ఒకరు. కాజల్ తో కలిసి మహేష్ చేసే సన్నివేశాలు చాలా రొమాంటిక్ గా ఉంటాయట. వాటిలో ఓ ముద్దు సన్నివేశం కూడా ఉందట. మొదట ఆ సన్నివేశం తీయాలా వద్దా అని దర్శకుడు చాలా ఆలోచించాడట. శ్రీకాంత్ అడ్డాల ఎప్పుడూ క్లీన్ సినిమాలే తీస్తుంటాడు. అందుకే ఆ సన్నివేశం గురించి చాలా ఆలోచించాడట. కానీ రొమాంటిక్ గా ఉంటుందని చిత్రబృందమంతా చెప్పడంతో మహేష్ - కాజల్ ల మధ్య ముద్దు సన్నివేశం తెరకెక్కించాల్సిందే అని ఫిక్సయ్యాడట. అయితే కాజల్ ఒప్పుకొంటుందో లేదో అన్న సందేహాలు వ్యక్తమైనా దర్శకుడు మాత్రం అడిగాడట. సినిమాకి అవసరమైతే అభ్యంతరమేమీ లేదని కాజల్ కూడా ఓకే చెప్పేసిందట. మరి ఇదివరకటి బిజినెస్ మేన్ లోని ముద్దులాగా టెక్నికల్ జిమ్మిక్కులతోనే తెరకెక్కిస్తారా లేక నిజంగానే ఒకరికొకరు పెదాలు అప్పగించేసుకొంటారా అన్నది తెలియాల్సి వుంది. మొత్తంగా ఎనిమిదేళ్ల ప్రయాణం తర్వాత కాజల్ ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తోంది.