సర్దార్ గబ్బర్ సింగ్ కోసం కాజల్ కూడా సొంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పేసిందనే టాక్ ఇటీవల ఇండస్ట్రీలో వినిపించింది. కాజల్ కూడా ఒకట్రెండు ఇంటర్వ్యూల్లో అదే విషయాన్ని తెలిపింది. ఈమధ్య హీరోయిన్లంతా సొంత గొంతు వినిపించడం చూసి కాజల్ కూడా టెంప్టయ్యిందేమో అని ఊహించారంతా. తొమ్మిదేళ్ల తర్వాతైనా సినిమాలో కాజల్ సొంత గొంతు వినే భాగ్యం దొరికిందిలే అని తెలుగు ప్రేక్షకులు ఒకింత ఖుషీ అయ్యారు. ఏమైందో తెలియదు కానీ... కాజల్ తెలుగులో డబ్బింగ్ చెప్పలేదట. ఆమె పాత్రకి మరొకరితో డబ్బింగ్ చెప్పించారట.
కాజల్ చెప్పిన డబ్బింగ్ నచ్చకపోవడంతో మరొకరితో డబ్బింగ్ చెప్పించారా లేదంటే కాజల్ అసలుకే డబ్బింగ్ చెప్పలేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే హిందీ వెర్షన్ కి మాత్రం కాజలే డబ్బింగ్ చెప్పిందట. స్వతహాగా హిందీ అమ్మాయి అయిన కాజల్ హిందీలో డబ్బింగ్ చెప్పుకోవడం సమస్యేమీ కాదు. ఆమె తెలుగు మాట్లాడటం గురించే అంతా ఎదురు చూస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడో ఎంట్రీ ఇచ్చింది కాజల్. ఆమె వెనక వచ్చినవాళ్లు కూడా తెలుగు గడగడా మాట్లాడేస్తున్నారు. ఇండస్ట్రీకొచ్చి సరిగ్గా మూడు నాలుగేళ్లు కూడా కాని రకుల్ ప్రీత్ సింగ్ అప్పుడే ఓన్ గా డబ్బింగ్ చెప్పుకొనే స్థితికి వచ్చింది. తమన్నాలాంటి కథానాయిక కూడా ఇటీవల ఊపిరిలో డబ్బింగ్ చెప్పింది. కానీ కాజలే ఆ విషయంలో చాలా పూర్. ఇప్పటిదాకా ఆమెకి తెలుగు రాదు. నేర్చుకున్నా కానీ... మాట్లాడలేకపోతున్నా అని చెబుతుంటుంది. అలాంటి కాజల్ తెలుగు డబ్బింగ్ చెప్పిందనడమే అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ దర్శకుడు బాబీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాజల్ తెలుగులో డబ్బింగ్ చెప్పలేదని స్పష్టం చేశాడు. సో... కాజల్ డబ్బింగ్ తూచ్ అన్నమాట.