అందనంత ఎత్తులో చందమామ

Update: 2015-07-29 07:07 GMT
అనగనగా ఒక చందమామ. అది అందనంత ఎత్తులో ఉంది. ఎంత డబ్బు చెల్లించినా అది పైనుంచి కిందికి దిగి రానంది. నీపై అలిగాను. నీకు కథలు రాయడమే రాదు. అందునా కథానాయికలకు సరైన క్యారెక్టర్లు క్రియేట్‌ చెయ్యడం అస్సలు రాదు. అని పైనున్న ఆ చందమామ తనలో తానే మదనంలో మునిగిపోయింది. అందుకే ఆ చందమామ తమిళ తంబీల్ని కనికరించినట్టు ఇంకెవరినీ కనికరించడం లేదు.

అక్కడైతే పారితోషికం అన్న బెంగే లేదు. ఎంత ఇస్తే అంతే పుచ్చుకుంటుంది. 20లక్షల నుంచి 70లక్షల లోపు పారితోషికం చాలు. అదే తెలుగులో తొక్కలో గ్లామర్‌ డాళ్‌ క్యారెక్టర్ల లోనే ఛాన్సులిస్తారు. హీరోలకు ఉన్న ప్రాధాన్యత కథానాయికలకు ఉండదు.. కాబట్టి ఇక్కడ మాత్రం కోటిన్నర డిమాండ్‌. అసలు అంత పెద్ద మొత్తం డిమాండ్‌ చేయడం వెనక ఉన్న బలమైన రీజన్‌ ఇది చదివాక ఆటోమెటిగ్గా ఎవరికైనా అర్థం కావాల్సిందే.

ఇప్పుడర్థమైందా? చందమామ ఎందుకంత ఎత్తులో ఉందో? ఎందుకు అందడం లేదో? తమిళ్‌లో 3 సినిమాలు, హిందీలో ఓ సినిమా చేస్తోంది ఈ చందమామ. తెలుగులో మాత్రం నిల్‌. టెంపర్‌ తర్వాత అస్సలు ఒక్క సినిమాకి కూడా సంతకం చేయలేదు. ఇక చందమామ ఎవరో మీకు చెప్పాల్సిన పనే లేదనుకుంటాం. మనోళ్ళు ఈ చందమామను సింపుల్ గా కాజల్ అగర్వాల్ అంటారు.
Tags:    

Similar News