ఫోటో స్టోరి: ఆ నవ్వుకు చీర సహాయం

Update: 2018-01-10 16:13 GMT
అమ్మాయిలకు ఏ డ్రెస్ వేసుకున్నా అందంలో తేడా రావచ్చు కానీ చీరలో కనిపిస్తే ఏ పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు. స్కిన్ టోన్ - ఆకృతి ఎలా ఉన్నా కూడా చీరల్లో యువతులు చాలా అందంగా ఉంటారని చెప్పవచ్చు. చీరలో గొప్పతనం గురించి ఎప్పటి నుంచొ మన కవులు పొగుడుతున్నారు. అందంగా కనిపించడమే కాకుండా చూసేవారికి కూడా ఒక తెలియని గౌరవం వారిపై కలుగుతుంది. చీర కట్టుకోవడానికి అర్హతలు అనవసరం. ఒక్క చిరు నవ్వు తెలిస్తే చాలు.

చీరలో ఎలాంటి వారైనా వెలిగిపోతారు. సంప్రదాయానికి మరో అర్ధం అనిపించే చీరను పరదేశి భామలు కూడా చాలా ఇష్టపడతారు. ఇకపోతే మన హీరోయిన్స్ కూడా చీరల్లో కనిపిస్తూ ఒక్కోసారి షాక్ ఇస్తారు. అదే తరహాలో కాజల్ కూడా ఒక స్వీట్ షాక్ ఇచ్చింది. ఎటువంటి గ్లామర్ డ్రెస్ లో కనిపించినా కూడా కాజల్ అందంగా కనిపిస్తుంది. కానీ పట్టు చీరల్లో కనిపించే సరికి హృదయంలో తెలియని అలజడి రేగుతున్నట్లు ఉందని చందమామ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

కాజల్ నవ్వుకు చీర అందం సహాయాన్ని అడిగితే.. అందం డైమండ్ రూపంలో వచ్చి కళ్లల్లో మెరిసింది. కాజల్ ని చూస్తుంటే బావ కవితలు తన్నుకొస్తున్నాయనిపిస్తోంది కదా. ఆకాశంలో చందమామ రోజు ఒకే అందంతో కనిపిస్తే నేలపైన ఈ చందమామ ఒక్కోసారి ఒక్కో అందంతో దర్శనం ఇస్తోంది. అందుకు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. ఇక ప్రస్తుతం కాజల్ ఎమ్మెల్యే - పారిస్ పారిస్ సినిమాల్లో నటిస్తోంది. ఇక అ! సినిమాలో స్పెషల్ రోల్ లో కనిపించబోతోన్న సంగతి తెలిసిందే. 
Tags:    

Similar News