‘సర్దార్ గబ్బర్ సింగ్’లో పని చేస్తున్న వాళ్లందరిదీ ఒకటే మాట. పవన్ ఈ సినిమాను అన్నీ తానై ముందుండి నడిపించాడని. తను సొంతంగా డైరెక్షన్ చేసిన ‘జానీ’ కంటే కూడా ఈ సినిమాలో చాలా చాలా ఇన్వాల్వ్ అయిపోయాడట పవన్. నిర్మాత శరత్ మరార్ తో పాటు చాలామంది పవన్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడుతోంది.. ప్రొడక్షన్ లో ఎంతగా ఇన్వాల్వ్ అవుతోంది చెబుతూ వస్తున్నారు. తాజాగా కాజల్ కూడా పవన్ ఇన్వాల్వ్ మెంట్ గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
‘‘పవన్ కళ్యాణ్ తో పని చేయడం అద్భుతమైన అనుభవం. ఆయనతో పని చేశాక పెద్ద అభిమానిని అయిపోయాను. ఆయన్ని నేను ఆరాధిస్తాను. పవన్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కోసం ఎంత కష్టపడ్డాడో మాటల్లో చెప్పలేను. తన క్యారెక్టర్ వరకు పరిమితం అయిపోకుండా సినిమాలోని ప్రతి పాత్ర మీదా శ్రద్ధ చూపించారు. నా క్యారెక్టర్ బాగా రావడానికి కూడా ఎంతో శ్రద్ధ పెట్టారు. ఎన్నో విషయాలు చెప్పారు. షూటింగ్ స్పాట్ లో బెటర్ మెంట్ కోసం ఎంతో ప్రయత్నించారు. ఇలా సినిమాలో ఉన్న ప్రతి పాత్ర మీదా ఆయన దృష్టిపెట్టారు. అన్ని పాత్రల మీదా ఆయన కన్నుండేది. పవన్ లో ఉన్న మల్టిపుల్ టాలెంట్స్ నాకు ఇప్పుడే తెలిశాయి. ఆయన గొప్ప వ్యక్తి. చాలా సింపుల్ గా ఉంటారు. షూటింగ్ లో ఆయన ఫోకస్ చూసి ఆశ్చర్యపోయా. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఓ ధమాకా’’ అని కాజల్ చెప్పింది.