యువరాణి మొహంలో తగ్గిన మిలమిల

Update: 2016-04-08 09:22 GMT
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. కెరీర్ స్టార్టింగ్ లోనే మగధీరలో యువరాణి మిత్రవిందగా నటించి.. టాలీవుడ్ యువరాణి అయిపోయిందీ భామ. మగధీర వచ్చిన ఏడేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన సర్దార్ గబ్బర్ సింగ్ లో ఇదే ప్రిన్సెస్ పాత్రలో కనిపించింది కాజల్. ఆ పాత్రకు, ఈ రోల్ కు ఉన్న పోలిక యువరాణి అన్న మాట ఒక్కటే.

కేరక్టర్ పరంగా డిఫరెన్స్ మాత్రమే కాదు.. కాజల్ ఫేస్ లో మిలమిల కూడా బాగా తగ్గినట్లుగా సర్దార్ గబ్బర్ సింగ్ చూస్తే అర్ధమవుతోంది. ఇన్నేళ్ల తర్వాత మరీ అప్పటిలా కనిపించాలని రూల్ ఏం లేదు కానీ.. హీరోయిన్ అన్నాక ఆ గ్లో కోసం ఆడియన్స్ ఎదురుచూడ్డంలో ఆశ్చర్యం లేదు. ఇప్పుడీ యువరాణి మొహంలో కనిపించనిది ఇదే.

ప్రస్తుతం సర్దార్ - తర్వాత బ్రహ్మోత్సవం.. కాజల్ కెరీర్ ఇప్పుడు స్పీడుగానే ఉన్నట్లు కనిపిస్తున్నా.. ఈ రెండిటి తర్వాత భారీ సినిమా ఏదీ లేకపోవడాన్ని గుర్తుంచుకోవాలి. యువరాణిగా కంటే.. రాణి పాత్ర అయితే సెట్ అయ్యేదేమో అనే మాటలు వినిపిస్తున్నాయంటే.. కాజల్ లో ఏజ్ డిఫరెన్స్ ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది.
Tags:    

Similar News