టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కెరీర్ ఇప్పుడు డోలాయమానంలోనే ఉంది. ఈ ఏడాది ఖైదీ నంబర్ 150 అంటూ మెగాస్టార్ కంబ్యాక్ మూవీతో ఓ బ్లాక్ బస్టర్.. నేనే రాజు నేనే మంత్రి అంటూ ఓ సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నా.. ఈ చందమామ కెరీర్ ఊపందుకోలేదు. సీనియర్ భామ అనే ట్యాగ్ పడిపోవడం.. పైగా భారీ రెమ్యూనరేషన్ చెల్లించాల్సి రావడంతో.. ఫిలిం మేకర్స్ ఈమెను తీసుకునేందుకు అంతగా సాహసించడం లేదు.
రీసెంట్ గా శర్వా సినిమాలో ఓ ఆఫర్ కాజల్ అగర్వాల్ కు అందగా.. ఆ ఆఫర్ ను తిరస్కరించిందనే టాక్ ఉంది. ఇప్పుడు కాజల్ పేరు మరో ప్రాజెక్టు కోసం వినిపిస్తోంది. వెంకటేష్ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందే చిత్రం కోసం ప్రస్తుతం హీరోయిన్స్ వేట సాగుతోంది. అనుష్క.. కాజల్ లను పరిశీలిస్తున్నారని.. దాదాపుగా కాజల్ పేరు ఖాయమైపోయిందని తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే ప్రకటన రావచ్చట.
కాజల్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన తేజ.. రీసెంట్ గా ఈమెతో నేనే రాజు నేనే మంత్రి చిత్రాన్ని రూపొందించాడు. ఆ మూవీ హిట్ కావడంతో.. అదే సెంటిమెంట్ ను రిపీట్ చేయాలని భావిస్తున్నాడట తేజ. పైగా వెంకీ-కాజల్ కాంబినేషన్ తొలిసారి కావడంతో.. జనాల్లో కూడా మంచి ఆసక్తి క్రియేట్ అవుతుందని భావిస్తున్నారట. అయితే.. కుర్ర హీరో శర్వానంద్ సినిమాని కాదని.. సీనియర్ హీరో వెంకీ మూవీని యాక్సెప్ట్ చేయడం వెనక కారణం ఏంటా అనే సంగతి చాలామందికి అర్ధం కావడం లేదు.