తాగొచ్చి కాజ‌ల్ న‌డుము గిల్లిన‌ హీరో?

Update: 2020-03-26 05:50 GMT
చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ టాలీవుడ్...కోలీవుడ్ ల‌లో టాప్ హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించేసిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ లోనూ స‌త్తా చాటే ప్ర‌య‌త్నం చేసింది. అయితే ద‌క్షిణాదిన వ‌చ్చినంత గుర్తింపు ఉత్త‌రాదిన రాలేదు. దీంతో అమ్మ‌డు ఇక్క‌డే బాగా ఫోక‌స్ అయింది. అయితే ఇన్నేళ్ల కెరీర్ లో అమ్మ‌డు ఏ  హీరోతోనూ ప్రేమా..గీమా అంటూ షికార్లు చేసిందే లేదు. స‌హ జీవ‌నాల జోలికి వెళ్లింది లేదు. ప్రోఫెష‌నల్ గాళ్ గానే మెప్పు పొందింది. కెరీర్ చివ‌రి ద‌శ‌కు చేరుకున్న ప్ర‌స్తుత‌ నేప‌థ్యంలో పెళ్లి చేసుకుని స్థిర‌ప‌డిపోవ‌డమే ఆల‌స్యం అనే క‌థ‌నాలు ఇటీవ‌ల వెలువ‌డ్డాయి. అప్ప‌ట్లో ఓ బిజినెస్ మ్యాన్ తో ల‌వ్ లో ప‌డింద‌న్న రూమ‌ర్ ఒక్క‌టే అంద‌రికీ తెలిసింది.

కానీ ఇవ‌న్నీ రూమ‌ర్లేన‌ని తేలింది. ఎందులోనూ నిజం లేద‌ని కాజ‌ల్ స్వ‌యంగా క్లారిటీ ఇచ్చేసింది. ద‌శాబ్ధానికి పైగా కెరీర్ లో అమ్మ‌డిపై ఎలాంటి మ‌చ్చ లేకుండా రిటైర్మెంట్ తీసుకుంటున్న భామ‌గా ఖ్యాతికెక్కింది. అయితే ఊహించ‌ని ఓ ఘ‌ట‌న మాత్రం కాజ‌ల్ కెరీర్ లో ఎప్ప‌టికీ ఓ చేదు గుళిక అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఓ త‌మిళ సినిమా షూటింగ్ లో కాజ‌ల్ లైంగిక వేధింపుల‌కు గురైన‌ట్లు ఓ వార్త  వేడెక్కించింది. ఓ స్టార్ హీరో తో క‌లిసి షూటింగ్ చేస్తున్న‌ప్పుడు స‌ద‌రు హీరో గారు కాజ‌ల్ న‌డుమును గ‌ట్టిగా ప‌ట్టుకుని ఇబ్బందికి గురిచేసిన‌ట్లు  కోలీవుడ్  స‌హా టాలీవుడ్ మీడియాలో ప్ర‌ముఖంగా ప్ర‌చార‌మైంది. వెబ్ స‌హా మెయిన్ స్ట్రీమ్ మీడియా సైతం అప్ప‌ట్లో ఈ న్యూస్ ని బాగా ఫోక‌స్ లోకి తెచ్చింది.

అదే ప‌నిగా స‌ద‌రు హీరో కాజ‌ల్ న‌డుమును కావాల‌నే గ‌ట్టిగా ప‌ట్టుకుని విడిచి పెట్ట‌లేద‌ని చివ‌రికి కాజ‌ల్ వ్య‌క్తిగ‌త అసిస్టెంట్ ముందుకెళ్లి ఆ పిడికిలిని విడిపించాల్సొచ్చింద‌ని ప్ర‌చారం సాగింది. దీంతో కాజ‌ల్ సెట్స్ నుంచి అర్ధంత‌రంగా బ‌య‌ట‌కు వెళ్లిపోవ‌డంతో కొన్ని నెల‌లు పాటు చిత్రీక‌ర‌ణ ఆగిపోయింద‌ని ప్ర‌చారం సాగింది. అటుపై ఆ సినిమా ప్ర‌చారంలో భాగంగా కాజ‌ల్..స‌ద‌రు హీరో మ‌ళ్లీ క‌లిసిపోయారని.. క‌లిసి ఆ సినిమాని ప్ర‌చారం చేయ‌డంతో సీన్ అర్ధ‌మైంది! అంటూ ప్ర‌ముఖంగా క‌థ‌నాలొచ్చాయి. అయితే తాజాగా అవ‌న్నీ త‌ప్పుడు క‌థ‌నాలేన‌ని తాజాగా అదే మీడియా సంస్థ వెల్ల‌డించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. స‌హ‌జంగా సోష‌ల్ మీడియాలో గోరంత జ‌రిగితే కొండంత‌ చేసి చూపించ‌డం స‌హ‌జం. కానీ ఇలాంటి క‌థ‌నాలు విష‌యాల్లో మాత్రం స‌ద‌రు మీడియా హ‌ద్దు మీరింద‌నే సంగ‌తి రివీలైంది.
Tags:    

Similar News