గుడ్‌ న్యూస్‌.. చందమామ అమావాస్య వీడబోతుందట

Update: 2022-08-21 02:30 GMT
టాలీవుడ్ చందమామ కాజల్‌ అగర్వాల్ బిడ్డకు జన్మనిచ్చిన నేపథ్యంలో దాదాపు ఏడాదిన్నర కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. సినిమాలకు ఇన్నాళ్లు దూరంగా ఉన్న కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టేందుకు సిద్ధం అవుతోంది. రీ ఎంట్రీ లో వెబ్‌ సిరీస్ తో ఈ అమ్మడు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు గాను సిద్ధం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

కాజల్ అగర్వాల్ గతంలోనే వెబ్‌ సిరీస్ లో నటించి మెప్పించిన విషయం తెల్సిందే. ఇప్పుడు మరోసారి ఈమె వెబ్‌ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు గాను రెడీ అవుతుందట.. ప్రముఖ దర్శకుడు రెడీ చేసిన స్క్రిప్ట్‌ ను ఈ అమ్మడు చదువుతుందట. కేవలం ఆ వెబ్‌ సిరీస్ కోసమే కాకుండా కొన్ని సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్‌ లను కూడా కాజల్‌ చదువుతుందట.

ప్రస్తుత పరిస్థితుల్లో కాజల్ అగర్వాల్‌ కమర్షియల్‌ సినిమా ల్లో ఆఫర్లను దక్కించుకోవడం అనేది దాదాపు అసాధ్యం. పైగా తెలుగు సినిమా పరిశ్రమ లో ఈమెకు రెగ్యులర్ కమర్షియల్ పాత్రలు రాకపోవచ్చు అంటూ మీడియా వర్గాల టాక్ ఉంది. అందుకే నటిగా వెబ్ సిరీస్ ల ద్వారా నిరూపించుకుని మళ్లీ నటిగా బిజీ అయ్యేందుకు ప్రయత్నాలను కాజల్ అగర్వాల్ చేయబోతుంది.

తెలుగు లో ఈమె మొన్నటికి మొన్న ది ఘోస్ట్‌ సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ స్థానం లో సోనాల్‌ చౌహాన్ ను ఎంపిక చేశారు. చిరంజీవి ఆచార్య సినిమా లో కూడా కాజల్ అగర్వాల్ ఉన్నట్లే అన్నారు.. చివరకు ఆమె పాత్రను పూర్తిగా లేపేశారు. ఇలాంటి సమయంలో టాలీవుడ్‌ అభిమానులు కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ కోసం వెయిట్‌ చేస్తున్నారు.

అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా కాజల్ అగర్వాల్ కి ఎలాంటి ఆఫర్‌ లు వస్తాయి... ఆమె మళ్లీ పూర్వ వైభవం ను దక్కించుకుంటుందా అంటూ ఎదురు చూస్తున్నారు.

కాజల్ అగర్వాల్ మునుపటి మాదిరిగా మళ్లీ అందంగా నాజూకుగా కనిపిస్తుంది. గర్భవతిగా ఉన్న సమయంలో కాజల్ కాస్త బొద్దుగా అయ్యింది. ఇప్పుడు మళ్లీ పూర్వ రూపం ను దక్కించుకుంది కనుక సినిమాలతో బిజీ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Tags:    

Similar News