నక్క తోక తొక్కేసిన కాజల్!!

Update: 2017-03-22 16:58 GMT
నిజంగానే మన స్టార్ హీరోయిన్లలో అత్యంత అదృష్టవంతులైన హీరోయిన్లు ఎవరైనా ఉన్నారా అంటే మాత్రం.. ఖచ్చితంగా కాజల్ అగర్వాల్ పేరునే ముందుగా చెప్పాలి. అసలు ఓ రెండు సంవత్సరాల క్రితమే ఆమె కెరియర్ పూర్తయ్యింది అనుకుంటే.. హీరోయిన్ల డేట్లు సర్దుబాటు కాకపోవడంతో.. బ్రహ్మోత్సం అండ్ సర్దార్ సినిమాలతో ఛాన్సులు వచ్చేసి.. కాజల్ కు లైఫ్ ఇచ్చేశారు.

ఆ తరువాత ఖైదీ నెం 150 వంటి సినిమాలతో దూసుకుపోయిన కాజల్ చేతిలో ఇప్పుడు ఆఫర్లు ఏమీ లేక ఖాళీగానే ఉంది. తమిళంలో విజయ్ తో ఒక సినిమా చేస్తోంది. అయితే విశేషం ఏంటంటే.. టెంపర్ సినిమాను హిందీలో రీమేక్ చేద్దామని ఫీక్సయిన రణవీర్ సింగ్.. ఆ సినిమాలో బడ్జట్ కంట్రోల్ చేయాలనే ఉద్దేశ్యంతో హీరోయిన్ గా కాజల్ ను తీసుకుందాం అనుకుంటున్నాడట. ఒకవేళ అమ్మడుని నిజంగానే తీసుకుంటే మాత్రం.. అమ్మడు ఎప్పుడో నక్క తోక తొక్కిందనే చెప్పాలి.

గతంలో బాలీవుడ్ లో ఓ రెండు సినిమాల్లో మెరిసిన కాజల్.. అక్కడ పెద్దగా క్లిక్కవ్వలేదు. ఈ మధ్యనే అక్కడ దో లఫ్జోంకి కహానీ అంటూ వీరభయంకరమైన లిప్ లాకులు ఇచ్చినా కూడా.. అబ్బే పనవ్వలేదు. ఇప్పుడు ఒకవేళ అదృష్టం ఏమన్నా కలిసొస్తుందేమో చూడాలి.
Tags:    

Similar News