అంజలి 60 లక్షలకు ఓకే చెప్పిందట!

Update: 2018-08-26 04:46 GMT
యాంగ్రీ యంగ్‌ మన్‌ రాజశేఖర్‌ ప్రస్తుతం ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో ‘కల్కి’ అనే చిత్రాన్ని చేసేందుకు సిద్దం అవుతున్న విషయం తెల్సిందే. గరుడవేగ చిత్రం తర్వాత రాజశేఖర్‌ నటించబోతున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ తన శక్తివంచన మేరకు ప్రయత్నిస్తున్నాడు. రాజశేఖర్‌ మూవీలో కాజల్‌ను హీరోయిన్‌గా తీసుకుంటే మంచి క్రేజ్‌ మూవీకి వస్తుందని దర్శకుడు భావించాడు. సినిమాలోని హీరోయిన్‌ పాత్ర కూడా కాజల్‌కు బాగా సూట్‌ అవుతుందని ఆయన భావించాడు. కాని కాజల్‌ మాత్రం రాజశేఖర్‌ తో నటించేందుకు మొదట ఆసక్తి చూపించలేదు. ఆ తర్వాత భారీ పారితోషికంను డిమాండ్‌ చేసింది.

ప్రస్తుతం స్టార్‌ హీరోలతో నటించే అవకాశం రానప్పటికి కాజల్‌ చిన్న హీరోలతో మంచి పారితోషికం అందుకుంటూ నటిస్తోంది. అలాగే రాజశేఖర్‌ మూవలో కూడా భారీ పారితోషికం దక్కితే నటించాలని భావించింది. దర్శకుడు ప్రశాంత్‌ వర్మ కాజల్‌ ను సంప్రదించిన సమయంలో ఏకంగా రెండు కోట్ల పారితోషికం డిమాండ్‌ చేసినట్లుగా తెలుస్తోంది. రాజశేఖర్‌ దంపతులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాంతో జీవిత స్వయంగా కాజల్‌ తో మాట్లాడే ప్రయత్నం చేసింది. కాజల్‌ పారితోషికం విషయంలో తగ్గక పోవడంతో ఆమె స్థానంలో తాజాగా అంజలిని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. కోటి పారితోషికంకు కూడా కాజల్‌ నటించేందుకు నో చెప్పడంతో దర్శకుడు ప్రశాంత్‌ వర్మ తెలుగమ్మాయి అంజలితో కమిట్‌ అయ్యాడు.

పలువురు హీరోయిన్స్‌ను పరిశీలించిన దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఈ చిత్రానికి, రాజశేఖర్‌ కు సరైన హీరోయిన్‌ అంజలి అంటూ నిర్ణయించుకుని ఆమెకు అడ్వాన్స్‌ కూడా ఇచ్చేశాడట. కాజల్‌ ఈ చిత్రంలో నటించేందుకు రెండు కోట్ల డిమాండ్‌ చేయగా, అంజలి మాత్రం కేవలం 60 లక్షల రూపాయలకు సినిమాను చేసేస్తున్నట్లుగా సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. అయితే కాజల్‌ ఈ చిత్రంలో ఉంటే ఖచ్చితంగా మంచి క్రేజ్‌ ఉండేది. కాని ఇప్పుడు అంజలి వల్ల అంతంత మాత్రంగానే ఈ సినిమాపై అంచనాలు ఉంటాయి. ఈ చిత్రాన్ని సక్సెస్‌ చేసి మంచి సినిమాను వదులుకున్నాను అంటూ కాజల్‌ బాధపడేలా చేయాలని దర్శకుడు ప్రశాంత్‌ వర్మ గట్టి పట్టుదలతో ఉన్నాడు. 1980 నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. రాఖీ పండుగ సందర్బంగా నేడు ఈ చిత్రం ప్రీ లుక్‌ ను విడుదల చేయబోతున్నారు. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించి, వచ్చే ఏడాదిలో సినిమాను విడుదల చేయాలని దర్శకుడు ప్రశాంత్‌ వర్మ భావిస్తున్నాడు.

Tags:    

Similar News