అమ్మా.. నీ మనసే వెన్న.. కాజల్ భావోద్వేగం

Update: 2020-12-20 13:30 GMT
‘‘అమ్మా.. నువ్వు మాపై చూపించిన ప్రేమకు.. ఐలవ్ యూ అనే పదం సరిపోదు.’’ అంటూ భావోద్వేగం చెందారు హీరోయిన్ కాజల్. తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా ఎమోషనల్‌ అయిన కాజల్.. ఈ సందర్భంగా ట్విట్టర్ లో ఓ పోస్టు పెట్టారు.

కాజల్‌ ఇటీవల బిజినెస్‌ మెన్‌ గౌతమ్‌ కిచ్లుని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పుట్టింటికి దూరమైన బాధలో ఉన్న కాజల్.. ఆమె తల్లి వినయ్‌ అగర్వాల్‌ పుట్టిన రోజు (డిసెంబర్ 20) సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యారు. తల్లితో తనకున్న అనుబంధాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు.

‘‘అమ్మా.. ఇతరుల ఆనందం కోసం ప్రతీ దాన్ని త్యాగం చేయడం మీ ప్రత్యేకత. అందుకు ఎంతో ప్రేమ అవసరం. ప్రతి విషయంలోనూ కంటికి రెప్పలా చూసుకున్నావు. నీ అందం, దయం, జ్ఞానం నిన్ను ఆరాధించేలా చేస్తాయి.

ఎల్లప్పుడూ మీ చుట్టూ ఉన్న వారిలో ఆనందం నింపుతావు. నా జీవితంలో బ్యాక్‌బోన్‌లా, ఒక రాతిలాగా నావెంట ఉన్నావు. నా ఆకాంక్షలను గుర్తించి ప్రోత్సహించావు. మీ స్వేచ్ఛాయుతమైన, ఉల్లాసమైన ఆత్మలో కొంత భాగాన్ని కూడా ఏదో ఒక రోజు సాధించాలని ఆశిస్తున్నా. నేను నిన్ను పోలి ఉన్నానని చాలా మంది చెప్పినప్పుడు నేను ఆనందంతో పరవశించిపోయాను. నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పే పదం నీ ప్రేమకి సరిపోదు. నాకు తెలిసిన అద్భతుమైన, ప్రకాశవంతమైన గర్ల్ వి నువ్వు. నీకు స్పెషల్‌ బర్త్ డే విషెస్‌. కృష్ణుడు నీకు ఎల్లప్పుడు అండగా ఉంటాడు, నిన్ను ఆనందంతో ఉంచుతాడు’’ అని పోస్ట్ చేసింది.
ప్రస్తుతం ఈ పోస్టు.. దానికి జత చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన పెళ్లి సందర్భంగా క్యాప్చర్ చేసిన కొన్ని ఫొటోలను యాడ్ చేసింది కాజల్.


Tags:    

Similar News