మౌనమే నా భాష అంటున్న స్టార్ హీరోయిన్

Update: 2017-04-05 08:15 GMT
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ కు.. దర్శక నిర్మాత కరణ్ జోహార్ కు చాలానే సాన్నిహిత్యం ఉంది. కలిసి సినిమాలు చేయడమే కాదు.. ఇద్దరూ రెండున్నర దశాబ్దాలుగా మంచి ఫ్రెండ్స్ కూడా. అయితే.. వీరిద్దరి ఫ్రెండ్ షిప్ కి రీసెంట్ గా బ్రేక్ పడింది.

కాజోల్ భర్త అజయ్ దేవగన్ కారణంగా.. తమ స్నేహం చెడిపోయిందంటూ తను రాసిన ఓ పుస్తకంలో కామెంట్స్ చేశాడు కరణ్ జోహార్. అయితే.. బుక్స్ అమ్ముకునేందుకే ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్నాడంటూ.. భర్తనే వెనకేసుకొచ్చిన కాజోల్.. కరణ్ విషయంలో రియాక్ట్ అయేందుకు మాత్రం నిరాకరిస్తోంది. ఈ విషయంలో సైలెంట్ ఉండడమే ఉత్తమంగా భావిస్తున్నట్లు చెప్పింది డీడీఎల్ బ్యూటీ. 'ఈ వ్యవహారంపై చాలానే హంగామా జరుగుతోంది. ఇలాంటి సిట్యుయేషన్ లో సైలెంట్ గా ఉండాలని అనుకుంటున్నా. ఈ సువిశాల ప్రపంచంపై నాకు నమ్మకం ఉంది. నేను చెప్పాలని భావించినపుడు.. నా మాటలు వింటారనే అనుకుంటున్నా' అని చెప్పింది కాజోల్.

తాజాగా సరోగసీ ద్వారా యష్.. రూహి అనే ఇద్దరు కవలలకు తండ్రి అయ్యాడు కరణ్ జోహార్. వీరిని చూసేందుకు వెళ్తారా అని మీడియా అడిగితే.. దానికి కూడా సైలెన్స్ నే సమాధానంగా ఇచ్చింది కాజోల్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News