అంజలి దేవత కరుణిస్తే.. ఇప్పుడైనా ఓకే

Update: 2016-03-20 07:30 GMT
మూడేళ్ల ముందు మాట.. తెలుగమ్మాయి అంజలి అప్పుడు తమిళంలో యమ స్పీడుమీదుంది. ఆమె నటించిన సినిమాలన్నీ వరుసగా హిట్టవుతున్నాయి. మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. అలాంటి టైంలో ఉన్నట్లుండి అదృశ్యమైపోయింది అంజలి. దర్శకుడు - నటుడు కళాంజియంతో తలెత్తిన గొడవే అందుకు కారణం. కెరీర్ ఆరంభంలో అంజలికి ఇతనే లిఫ్ట్ ఇచ్చాడు.

కళాంజియం స్వీయ దర్శకత్వంలో ఓ బి-గ్రేడ్ టైపు సినిమా తీసి.. అందులో అంజలికి అవకాశమిచ్చాడు. ఆ సినిమాపై తీవ్ర విమర్శలు వచ్చినప్పటికీ అంజలి నటనకు మాత్రం మంచి పేరొచ్చింది. ఆ తర్వాత అంజలి తన టాలెంటుతోనే హీరోయిన్ గా నిలదొక్కుకుంది. ఐతే కళాంజియంతో పాటు అంజలి పిన్ని ఒకరు ఆమెను గుప్పెట్లో పెట్టుకుని ఆటాడించారు. వాళ్లతో గొడవ పెట్టుకుని అంజలి ఉన్నట్లుండి అదృశ్యమైపోయింది.

తనతో ఓ సినిమాకు కమిట్మెంట్ ఇచ్చి.. మాట తప్పిందంటూ కళాంజియం అంజలిపై పెట్టిన కేసు ఇప్పటికీ కోర్టులోనే ఉంది. అంజలి మాత్రం ఈ కేసు విషయంలో ఎప్పుడూ నోరు విప్పదు. ఐతే కలాంజియం మాత్రం కోర్టు బయట కేసు పరిష్కరించుకోవడానికి రెడీ అంటున్నాడు. అంజలి ఒప్పుకుంటే కేసు వాపసు తీసుకుని.. ‘ఊర్ చుట్టి పురాణం’ పేరుతో ఆమె ప్రధాన పాత్రలో మొదలుపెట్టిన సినిమాను పూర్తి చేసి విడుదల చేద్దామనుకుంటున్నట్లు చెప్పాడు కలాంజియం. మరి అంజలి అతడి ఆఫర్ ను ఒప్పుకుంటుందా?
Tags:    

Similar News