కాస్త నయన్‌కి కూడా చెప్పమ్మా...

Update: 2015-05-25 07:30 GMT
సినిమా పూర్తి చేయడం వరకే మా బాధ్యత. ఆ తర్వాత మాకు సంబంధం లేదు అని నిర్మొహమాటంగా  చెప్పేస్తుంటారు కొందరు నాయికలు. ఆ జాబితాలో నయనతార, ఇలియాన, కాజల్‌ పేర్లు ముందు వరుసలో ఉంటాయి. ముఖ్యంగా నయనతార ఇటీవలి కాలంలో దర్శకనిర్మాతలకు చుక్కలు చూపించేసింది. మోజుతో వెళ్లి తనని ఎంపిక చేసుకున్న అందరు నిర్మాతలకు ఈ అమ్మడు సినిమా రిలీజ్‌ తర్వాత ప్రమోషన్‌కి రాకుండా డుమ్మా కొట్టింది. దానికి తన కారణాలేవో తాను చెప్పుకొచ్చేది.

అయితే ఇదే పద్ధతిలో బాలీవుడ్‌ కథానాయిక కల్కీ కొచ్లిన్‌ కూడా ఉండేదిట గతంలో. కానీ తనలో ఇప్పుడు మార్పొచ్చిందని చెబుతోంది. కెరీర్‌ ఆరంభం పెద్దగా ప్రచారాలకు వెళ్లడాన్ని ఇష్టపడేదాన్ని కాను. దానివల్ల ఎన్నో అవకాశాలు మిస్సయ్యానని చెప్పుకొచ్చింది. అంతేనా ఇటీవలే మార్గరిటా విత్‌ ఎ స్ట్రా అనే సినిమాతో పెద్ద హిట్టొచ్చింది. దీన్ని నిలబెట్టుకుంటూ మరికొన్ని చిన్న సినిమాల్లోనే చేయాలనుకుంటున్నా. ఎవరైనా నిర్మాత ఏడాది తర్వాత కూడా ఈవిడకు మార్కెట్‌ ఉంటుంది అని నమ్మితేనే పెద్ద హీరోయిన్‌ అయినట్టు అని నిజాయితీగా మాట్లాడింది. అయితే ఈ రియలైజేషన్‌ గురించి నయనతార లాంటి నాయికలకు అమ్మడు నూరి పోస్తే బావుండు..
Tags:    

Similar News