ముసలోళ్లతో రొమాన్స్ సూపర్ అంటోంది

Update: 2016-05-18 07:29 GMT
ఎంత నటన అయినప్పటికీ.. తమ కంటే వయసులో చాలా పెద్దవాళ్లయిన వాళ్లతో రొమాన్స్ చేయడం అన్నది హీరోయిన్లకు కష్టమైన వ్యవహారమే. ఈ విషయంపై ఓపెన్ గా మాట్లాడ్డానికి చాలామంది ఇష్టపడరు. ఐతే ఫారిన్ భామ కల్కి కొచ్లిన్ మాత్రం తనకు వయసు మళ్లిన వాళ్లతో రొమాన్స్ చేయడం చాలా ఇష్టమంటోంది. అందులోనూ నసీరుద్దీన్ షా లాంటి వాళ్లతో రొమాన్స్ ను చాలా బాగా ఎంజాయ్ చేస్తానని చెబుతోంది.

నసీరుద్దీన్-కల్కి కొచ్లిన్ కలిసి ‘వెయిటింగ్’ అనే సినిమాలో నటించారు. తనకంటే మూడింతల వయసున్న వ్యక్తితో ఓ పడుచు పిల్ల ఎఫైర్ నడిపే నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఇంతకుముందు కాస్త ఇటు ఇటుగా ఇలాంటి కథతోనే రామ్ గోపాల్ వర్మ.. అమితాబ్ బచ్చన్-జియా ఖాన్ జంటగా ‘నిశ్శబ్ద్’ అనే సినిమా తీశాడు. దాంతో పోలిస్తే ‘వెయిటింగ్’ కాస్త మెచ్యూర్డ్ లవ్ స్టోరీ లాగుంది. దీని ట్రైలర్ కూడా చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది.

ఐతే నీకంటే మూడింతల వయసున్న నసీరుద్దీన్ తో రొమాన్స్ చేయడానికి ఇబ్బందిగా అనిపించలేదా అని కల్కిని అడిగితే.. ‘‘అసలు నాకు వయసు మళ్లిన వాళ్లతో రొమాన్స్ అంటేనే ఇష్టం. అందులోనూ నసీరుద్దీన్ షా లాంటి వాళ్లతో అయితే మరింతగా ఎంజాయ్ చేస్తా’’ అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఫ్రాన్స్ లో పుట్టి ఇండియాకు వచ్చిన కల్కి ఇప్పటికే చాలా షాకింగ్ రోల్స్ చేసింది. డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ను పెళ్లి చేసుకుని కొన్నేళ్లకే విడిపోయిన కల్కి.. ప్రస్తుతం సినిమాలే తన జీవితం అంటోంది.
Tags:    

Similar News