అ ! లాంటి విభిన్నమైన చిత్రాన్ని అందించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ రెండో సినిమా కల్కి టీజర్ ఇందాకా విడుదల చేశారు. యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ హీరోగా రూపొందుతున్న మూవీ బ్యాక్ డ్రాప్ ఏంటనే విషయం గురించి ఇప్పటి దాకా గోప్యత పాటించిన టీమ్ టీజర్ లో చూచాయగా దాని గురించి చెప్పే ప్రయత్నం చేసింది.
ఇది 1985 బ్యాక్ డ్రాప్ లో సాగే ఒక స్టోరీ. అనగనగా ఒక ఊరు. అంతుచిక్కని మరణాలు. ఊహించని దుర్మార్గాలు. మొత్తాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్న ఓ విలన్ల ముఠా. హడలెత్తిపోతున్న జనం. అసలు ఏం జరుగుతోందో ఎవరికి అర్థం కానీ పరిస్థితి. అప్పడు వస్తాడు కల్కీ. దీని వెనుక ఉన్న రహస్యాన్ని చేధించేందుకు ప్రాణాలకు తెగించి మరీ సిద్ధపడతాడు. అసలు ఇతను ఎవరు కల్కిగా ఆ ఊరికి ఎందుకు వచ్చాడు అనుకున్నది సాధించాడా లేదా అనే అసలు కథగా తోస్తోంది
టీజర్ మొత్తం ఉత్కంఠభరితమైన యాక్షన్ షాట్స్ తో నింపేశారు. రాత్రి పూట ఓ చెట్టు కాలిపోవడం ఓ సరస్సు నిండా లెక్కలేనన్ని సంఖ్యలో శవాలు తేలడం విచిత్రమైన గెటప్పుల్లో ఉన్న ఆకారాలతో హీరో పోరాడటం అంతా చాలా డిఫరెంట్ గా ఉంది. రెగ్యులర్ మాస్ మసాలాలకు దూరంగా ప్రశాంత్ వర్మ తనదైన మేకింగ్ స్టైల్ తో ఆకట్టుకున్నాడు.
జయప్రకాశ్ రాహుల్ రామకృష్ణ అశుతోష్ రానా శత్రు ఇలా ఎవరికి వారు పూర్తి విభిన్నమైన పాత్రల్లోకనిపించారు. దాశరధి శివేంద్ర ఛాయాగ్రహణం శ్రవణ్ భరద్వాజ్ సంగీతం ఒకదాంతో మరొకటి పోటీ పడ్డాయి. గరుడవేగాకు మించిన డెప్త్ ఇంటెన్సిటీ ఇందులో కనిపిస్తోంది. మొత్తానికి అంచనాలు రేపడంలో కల్కి టీం సక్సెస్ అయ్యింది.