ట్రైలర్ టాక్ : హత్య వెనుక అరాచకం

Update: 2019-06-25 05:30 GMT
యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన కల్కి ఈ వారం 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గతంలో కమర్షియల్ ట్రైలర్ ని రిలీజ్ చేసిన టీమ్ తాజాగా హానెస్ట్ ట్రైలర్ పేరుతో మరొకటి విడుదల చేశారు. ఇప్పటిదాకా థీమ్ గురించి అర్థం కాక సస్పెన్స్ లో ఉన్న ప్రేక్షకులకు ఇందులో కీలకమైన క్లూస్ ఇచ్చేశారు. 1985 ప్రాంతం. తెలంగాణ రాష్ట్రంలోని కొల్లాపూర్ అనే ఊరి ఎమ్మెల్యే(అశుతోష్ రానా)తమ్ముడిని ఎవరో దారుణంగా కిరాతకంగా హత్య చేస్తారు.

దాని వివరాలు సేకరించే పనిలో ఉంటాడు ఓ యువకుడు (రాహుల్ రామకృష్ణ). ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి పోలీస్ ఆఫీసర్(రాజశేఖర్)వస్తాడు. పైకి కనిపించినంత సులభంగా కేసు ఉండదు. తెరవెనుక ఎమ్మెల్యే అతని శత్రువుల మధ్య ఎన్నో దుర్మార్గాలు ప్రపంచానికి తెలియకుండా ఉంటాయి. వాటిని అన్వేషించడం మొదలుపెడతాడు హీరో. అసలు కల్కి అంటే ఎవరు ఒక హత్య వెనుక ఇంత అరాచాకం ఏం జరిగింది అనేది తెలియాలంటే కల్కి చూడాల్సిందే

గతంలో వచ్చిన టీజర్ ట్రైలర్ కంటే ఇప్పుడీ వీడియోలోని నిజంగానే నిజాయితీ ఉంది. ప్రశాంత్ వర్మ టేకింగ్ లో చాలా ఇంటెన్సిటీ కనిపిస్తోంది. అప్పటి వాతావరణాన్ని సృష్టించడంతో పాటు పాత్రలు డిజైన్ చేసిన తీరు సస్పెన్సు తో పాటు థ్రిల్ ని మిక్స్ చేస్తూ కూర్చిన విధానం ఆసక్తి రేపెలా ఉంది. రాజశేఖర్ తో సహా పాత్రలను ఎక్కువ రివీల్ చేయకుండా అందరిని తక్కువ షాట్స్ లో  క్రిస్పీగా చూపించారు

దాశరథి శివేంద్ర ఛాయాగ్రహణం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. విజువల్స్ ని బంధించిన తీరు అద్భుతంగా ఉంది. దానికి తగ్గట్టే శ్రవణ్ భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంచనాలు అమాంతం పెంచేసింది.  క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీలో అదా శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా జయప్రకాష్-శత్రు-నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గత కొన్ని చిత్రాలకు రాజశేఖర్ కు డబ్బింగ్ చెప్పిన సాయి కుమార్ వాయిస్ ఇందులో వినిపించలేదు. స్వరం మారింది. మొత్తానికి ఇంకో మూడు రోజుల్లో విడుదలకు ముందు వదలిన ట్రైలర్ హైప్ ని పెంచేసింది


Full View
Tags:    

Similar News