ఎన్టీఆర్ మూవీ రీమేక్ కాదులే

Update: 2017-06-07 04:19 GMT
వరుస హిట్స్ జోరు చూపిస్తున్న జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు జై లవ కుశ అంటూ మూవీ చేస్తున్నాడు. జనతా గ్యారేజ్ సక్సెస్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో.. అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. కానీ ఈ చిత్రంలో ఎన్టీఆర్ ట్రిపుల్ యాక్షన్ చేస్తున్నాడనే విషయం ఫైనల్ కావడంతో.. అజిత్ నటించిన తమిళ్ మూవీ వరలారుకు ఇది కాపీ అనే ఆరోపణలు వచ్చాయి.

ఈ మధ్య ఇన్ స్పిరేషన్ పేరుతో కాపీలు ఎక్కువయిపోవడంతో.. వరలారు నిర్మాత రీసెంట్ గా 'జై లవ కుశ' నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ ను అప్రోచ్ అయ్యాడు. తాను కేసు ఫైల్ చేయాలని అనుకుంటున్న విషయాన్ని వెల్లడించాడు. ఇది వివాదంగా మారే అవకాశం ఉండడంతో.. స్టోరీ రైటర్ తో 'జై లవ కుశ' కథను తమిళ నిర్మాతకు చెప్పించాడు కళ్యాణ్ రామ్. వరలారు మూవీకి.. ఎన్టీఆర్ కొత్త సినిమాకు సంబంధం లేదని తెలియడంతో సంతృప్తిగా వెళ్లిపోయాడట.

వరలారు మూవీతో అజిత్ మూడు పాత్రలు చేయగా.. తండ్రి.. ఇద్దరు కొడుకుల పాత్రల్లో కనిపిస్తాడు. కానీ జై లవ కుశలో ఎన్టీఆర్ చేస్తున్న మూడు పాత్రలు కుర్రాళ్ల కేరక్టర్లే. గుడ్.. బ్యాడ్.. అగ్లీకి సంకేతాలుగా ఈ మూడు రోల్స్ కనిపించనున్నాయి. పైగా ఇది స్టోరీ కంటే.. స్క్రీన్ ప్లే పై ఎక్కువగా ఆధారపడే గేమ్ అని తెలుస్తోంది. యాక్షన్ ఓరియెంటెడ్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తుండగా.. రాశిఖన్నా.. నివేదా థామస్ లు హీరోయిన్లుగా కనిపించనున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News