హమ్మయ్యా! బయట బ్యానర్లో కొట్టాను

Update: 2018-04-02 04:52 GMT
నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన రీసెంట్ మూవీ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. గత షాక్ ల నుంచి కళ్యాణ్ రామ్ ను బయటకు తీసుకు వచ్చింది ఎమ్మెల్యే. ఈ చిత్రం ద్వారా మళ్లీ తను ఫామ్ లోకి వచ్చినందుకు కళ్యాణ్ రామ్ హ్యాపీగానే ఉన్నాడు. వరుసగా సినిమాలు అంగీకరిస్తూ.. చకచకా ఫినిష్ చేసేస్తూ దూకుడు చూపిస్తున్నాడు.

పొలిటికల్ యాంగిల్ ఉన్న ఎమ్మెల్యే మూవీ సక్సెస్ సాధించడం.. త్వరలో రానున్న చిత్రాలు విభిన్నమైనవి కావడంతో.. వాటి రిజల్ట్ పై కూడా కళ్యాణ్ రామ్ కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు. 'ఆడియన్స్ అభిమానులు నన్ను ఎంకరేజ్ చేస్తున్న తీరుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సారి ఉగాది.. శ్రీరామనవమి పండుగలను నేను చాలా సంతోషంగా గడిపాను. ఇందుకు కారణం విజయం దక్కడమే అని చెప్పాల్సిన పని లేదు. ఇప్పటివరకూ నా సొంత బ్యానర్ పై మాత్రమే హిట్స్ సాధించాను. తొలిసారిగా ఇతర నిర్మాతలకు చేసిన సినిమా విజయం సాధించడం ఆనందంగా ఉంది' అన్నాడు కళ్యాణ్ రామ్.

కెమెరామ్యాన్ నుంచి దర్శకుడిగా మారిన గుహన్ రూపొందించబోతున్న ఓ మూవీలో కళ్యాణ్ రామ్ నటించబోతుండగా ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోయింది. విరించి వర్మ దర్శకత్వంలో కూడా కళ్యాణ్ రామ్ ఓ సినిమా చేయనుండగా.. పవన్ సాదినేని డైరెక్షన్ లో ఓ ఫన్ ఎంటర్టెయినర్ కూడా యాక్సెప్ట్ చేశాడు నందమూరి హీరో.


Tags:    

Similar News