మామూలుగా చాలా తక్కువగా మాట్లాడే హీరోలు.. వేరే హీరోల గురించి తమ అభిప్రాయాలు చెబితే వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నందమూరి కళ్యాణ్ రామ్ ఇలాంటి కథానాయకుడే. అతను మాట్లాడేది తక్కువ. ఎప్పుడైనా ప్రస్తావిస్తే ఎన్టీఆర్.. బాలయ్య.. జూనియర్ ఎన్టీఆర్ ల గురించే తప్ప వేరే హీరోల గురించి మాట్లాడటం మరీ అరుదు. అతను తాజాగా ఒక ఇంటర్వ్యూలో నిన్నటితరం టాలీవుడ్ బడా హీరోల గురించి తన అభిప్రాయాల్ని ఆసక్తికర రీతిలో చెప్పాడు. తాను చదువుకునే రోజుల్లో.. అమెరికాలో ఉన్నపుడు మెగాస్టార్ చిరంజీవి.. అక్కినేని నాగార్జున.. విక్టరీ వెంకటేష్ తనను ఎలా ఆకట్టుకున్నారో.. వాళ్లలో తనకు ఏం నచ్చేదో వివరించాడు.
అమెరికాలోని మల్టీప్లెక్సుల్లో ‘పాస్’ పద్ధతి ఉండేదని.. అది తీసుకుంటే ఎన్ని సినిమాలైనా.. ఎన్నిసార్లైనా చూడొచ్చని.. అప్పట్లో పాస్ ద్వారా తాను చిరంజీవి సినిమాలే ఎక్కువగా చూసేవాడినని కళ్యాణ్ వెల్లడించాడు. చిరంజీవి డ్యాన్సుల్లో ఒక గ్రేస్ ఉండేదని.. అది తనకు చాలా నచ్చేదని చెప్పాడు. ఇక నాగార్జునను ‘శివ’ సినిమాలో చూసి చాలా ఇష్టపడ్డానని.. భలే ఉన్నాడే అనిపించిందని తెలిపాడు. ఇక వెంకటేష్ విషయానికి వస్తే.. ‘సూర్య ఐపీఎస్’.. ‘శత్రువు’ సినిమాల్లో ఆయన ఫిజిక్.. కండలు తనను ఆకర్షించాయని.. ఆయనకు అభిమానిగా మారిపోయానని కళ్యాణ్ రామ్ వెల్లడించాడు. ఇప్పటికీ వీళ్లందరి సినిమాలనూ తాను ఆస్వాదిస్తానని ఈ నందమూరి హీరో తెలిపాడు. ఈ సందర్భంగా బాలయ్య గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు కళ్యాణ్ రామ్.