యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి రూపొందించిన యమదొంగ ఎంత స్పెషల్ మూవీగా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫాంటసీ జానర్ లో రెగ్యులర్ లైన్ ని టచ్ చేస్తూనే జక్కన్న ఇచ్చిన డిఫరెంట్ ట్రీట్మెంట్ దాన్ని బ్లాక్ బస్టర్ గా నిలిపింది. ఇప్పుడు తారక్ అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఇలాంటి ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో స్టోరీ మీద ఆసక్తి చూపిస్తున్నాడట. యముడి కథ కాదు కానీ దేవలోకాలు భూమిని కనెక్ట్ చేస్తూ ఓ కొత్త లైన్ ని డెబ్యూ డైరెక్టర్ ఒకరు వినిపిస్తే దానికి బాగా ఎగ్జైట్ అయిన కళ్యాణ్ రామ్ స్వంతంగా నిర్మించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నట్టు ఫిలిం నగర్ టాక్.
అయితే బడ్జెట్ భారీగా అవసరం ఉండటంతో ఎంత వరకు దాన్ని తగ్గించవచ్చు అనే దాని గురించి ఆలోచనలు జరుగుతున్నాయట. ఒకవేళ ఓకే అయితే కళ్యాణ్ రామ్ ఇప్పుడు చేస్తున్న ఎంత మంచివాడవురా తర్వాత ఇదే ఉండొచ్చు. గత కొంతకాలంగా చాలా వీక్ గా ఉన్న కళ్యాణ్ రామ్ మార్కెట్ 118తో కొంత కోలుకుంది. తక్కువ బడ్జెట్ తో రూపొందిన సినిమా కావడంతో బయ్యర్లు నిర్మాత సేఫ్ అయ్యారు. కానీ రిస్క్ చేసి భారీ బడ్జెట్ తో చేస్తే కళ్యాణ్ రామ్ ఎంతవరకు రాబట్టగగలడు అనేది కష్టమైన ప్రశ్నే.
కెరీర్లోనే పెద్ద హిట్స్ గా నిలిచినా అతనొక్కడే-పటాస్ లకు మూడు నాలుగింతలు ఎక్కువ పెర్ఫార్మ్ చేస్తేనే కళ్యాణ్ రామ్ సినిమా ఆ స్థాయిలో రిటర్న్స్ ఇవ్వగలదు. ఫాంటసీ జానర్ కాబట్టి రిస్క్ చేయొచ్చు కానీ కొత్త దర్శకుడిని నమ్మి కళ్యాణ్ రామ్ దీనికి సై అంటాడా లేదా అనేది ఇంకొద్ది రోజులు ఆగితే కానీ తెలిసే ఛాన్స్ లేదు. పైగా ఇప్పుడు చేస్తున్న సినిమా కూడా ఫ్యామిలీ సినిమా కావడంతో మాస్ మార్కెట్ ని టార్గెట్ చేయడం లేదు . ఫాంటసీ అంటే అన్ని వర్గాలను ఆకట్టుకోవాలి కాబట్టి చాలా కసరత్తే అవసరమవుతుంది