'షేర్' అంటూ ఈ ఏడాది మరోసారి మోత మోగించడానికి వస్తున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఇప్పటికే 'పటాస్' సినిమాతో హిట్టు కొట్టాడు కాబట్టి.. ఈసారి దానిని కంటిన్యూ చేస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ నందమూరి యువకిశోరం ఏమంటున్నాడంటే... పదండి ఈ ఎక్స్ క్లూజివ్ ఇంటర్యూలో చూద్దాం.
'షేర్' విశేషాలు మీ మాటల్లో...
ఇదో రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. టర్నులు - ట్విస్టులు ఏవీ ఉండవు. నాలో వెరైటీ ఏదీ చూడరు. దర్శకుడు మల్లి నాతో పాటు కెరీర్ ప్రారంభించి ట్రావెల్ అవుతున్నాడు. తనకో మంచి హిట్ కావాలి. అందుకు మీ ప్రోత్సాహం కావాలి.
మొదటి నుంచి మల్లిపై పూర్తి కాన్ఫిడెన్స్ తో ఉంటున్నారు. దానికి కారణం?
మనిషిలో కాన్ఫిడెన్స్ లేకపోతే ముందుకెళ్లలేడు. నా కెరీర్ రెండో సినిమా అభిమన్యు చూస్తున్నప్పుడే ఇంటర్వెల్ తర్వాత .. ప్రేక్షకుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి. ఏదో తేడా చేశామని అర్థమైంది. రెండో సినిమాకి యాక్షన్ ఎక్కువ చేయకూడదు అని అనుకుంటే ప్రేక్షకుల్లో అంచనాలు వేరేగా కనిపించాయి. ఎంచుకున్న కథాంశం లవ్ స్టోరీ. జనాల అంచనాలు వేరు. ఇలాంటివన్నీ.. మల్లి దృష్టిలో పెట్టుకుని ఈసారి షేర్ స్క్రిప్టుని చాలా తెలివిగా తీర్చిదిద్దాడు. జనాల అంచనాలకు తగ్గట్టు సినిమాని మలిచాడు.
పటాస్' వంటి హిట్టు వచ్చాక 'అంతకుమించి' ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు.. అంచనాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని 'షేర్' అందుకుంటుందా?
వాస్తవానికి పటాస్ ప్రారంభించకముందే ఓకే చేసిన సబ్జెక్టు ఇది. అనివార్య కారణాల వల్ల ఆలస్యమైంది. అంతేకాదు.. ఓం 3డి రిలీజ్ తర్వాత మైండ్‌సెట్ అంతా మారింది. మరీ ట్విస్టులు - టర్నులు - సీరియస్ యాక్షన్ తో బరువు లేకుండా స్ట్రెయిట్ నేరేషన్ తో - పూర్తి క్వాలిటీతో చేసిన ఫిలిం ఇది. ఏదో ఓ ట్విస్టు అయితే ఉంది. అది నా బ్రాండ్ అని అనుకుంటాను. ప్రతి హీరోకి ఓ సక్సెస్ వచ్చాక .. అంచనాలు రెట్టింపవుతాయి. అంచనాలు ఉంటే సంతోషమే. కానీ పటాస్ లాగా భారీ డైలాగులు ఉన్న సినిమా కాదు ఇది. పోలీస్ వేషం - యారొగెన్సీ కనిపించదు. ఓ మామూలు పక్కింటి అబ్బాయి కథ ఇది. ఓ నార్మల్ సినిమాకి వెళుతున్నాం అని వెళ్లి చూడండి. అందరికీ నచ్చుతుంది. పూర్తి వినోదాన్ని ఆకట్టుకుంటుంది.
పటాస్ తర్వాత వస్తోంది... కథలో మార్పు చేర్పులేవైనా చేశారా?
కథలో మార్పులు చేయలేదు.. కానీ స్క్రిప్టులో ఎంటర్ టైన్ మెంట్ శాతం పెంచాం. హీరోయిన్ మార్పు గురించి తెలిసిందే.
వన్యా మిశ్రాని కథానాయికగా ఎంపిక చేసుకుని... సోనాల్ తో రీప్లేస్ చేశారు కారణం?
వన్య స్క్రీన్ ప్రెజెన్స్ అంతగా నచ్చలేదు. అందుకే మార్చాల్సొచ్చింది. కేవలం 10రోజుల చిత్రీకరణ మాత్రమే అప్పటికి జరిగింది. కొద్దిరోజులే రీషూట్ చేశాం అంతే. మార్పు కోరుకున్నాం కాబట్టే.. సినిమా కొన్నిరోజులు ఆపాం.
సినిమాలో మీ క్యారెక్టర్ గురించి?
కథానాయకుడు ఓ సివిల్ ఇంజినీర్. స్థిరాస్తి వ్యాపారి అయిన తండ్రికి సాయం చేస్తుంటాడు. ఒకేసారి రెండు రకాలుగా ఆలోచించే కుర్రాడు. మైండ్ లో ఒకటి రన్ అవుతుంటే బైటికి ఇంకోలా చేస్తుంటాడు. క్యారెక్టర్ లో ప్రత్యేకత అదే.
పాత్ర పరంగా ఏవైనా జాగ్రత్తలు తీసుకున్నారా?
ఆ అవసరం రాలేదు. ఓం లాగా ఇది ప్రయోగం కాదు. గుండు కొట్టించుకోనక్కర్లేదు. పక్కింటి అబ్బాయిగా కనిపిస్తా. మల్లితో ఇదివరకే సినిమాలకు పనిచేశాను కాబట్టి క్యారెక్టర్ పని సులువైంది.
'ఓం 3డి' తర్వాత ప్రయోగాల జోలికి వెళ్లకూడదు అని ఫిక్సయ్యారా?
ప్రయోగాలు మానేస్తా అని అనలేదు. నిజానికి ఆ సినిమాపై ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేశా. మూడేళ్ల శ్రమించా. ఇదే నా జీవితం అనుకుని చేశా. 3డి టెక్నాలజీ తెచ్చి - పరిశోధించి సినిమా చేశాం. మూడేళ్లు వేరే కమిట్ మెంట్లు అన్నీ పక్కనపెట్టేసి ఆ ఒక్క సినిమా కోసం శ్రమించాం. అంత శ్రమించిన సినిమాకి డిజాస్టర్ - ఫ్లాప్ లాంటి మాటలు వినిపిస్తే తట్టుకోలేకపోయాను. ఒక సినిమా లవర్ గా ఎంతో గ్రాండియర్ గా ఉండాలి. లేదా సమస్యల్ని వదిలేసి ఎంజాయ్ చేేసేలా సినిమా ఉండాలి. ప్రేక్షకులకు బరువు పెంచకూడదు. ఓం లో టూమచ్ ఫ్లాష్ బ్యాక్ నేరేషన్ - కామెడీ లేకపోవడం మైనస్ అయ్యింది. అలాగని ప్రయోగాలు చేయకపోతే నా మనసు నిలవదు. అవి తప్పక చేస్తాను. నా మార్క్ లో డిఫరెంట్ జోనర్ సినిమాలు చేస్తాను.
దర్శకుడు మల్లి శ్రమ గురించి?
ఈ సినిమా విషయంలో అందరికంటే ఎక్కువ శ్రమించింది మల్లి. నేను వేరే సినిమాలతో బిజీగా ఉన్నాను. పైగా షేర్ నిర్మాత కూడా కొత్త. అయినా.. సినిమాకి సంబంధించి ప్రతి విషయాన్ని మల్లినే చూసుకున్నాడు.
బైటి ప్రొడ్యూసర్ అయితే రిలాక్స్‌డ్ గా పనిచేస్తారా?
అలాంటిదేం ఉండదు. నా, పర అనే తేడా ఉండదు. నిర్మాతలకే నేరుగా ఆ విషయాన్ని చెప్పేస్తా. అనవసరంగా ఖర్చు చేయొద్దు. సీజీలో చేయాల్సిన వాటికోసం .. వేరొక రకంగా అనవసరంగా ఖర్చు చేయొద్దని చెబుతా. నాకు సొంతంగా సీజీ కంపెనీ ఉంది కాబట్టి సీజీలో ఆ పనులు చేసుకోండి అంటాను. నాది, బయటిది అనే తేడా ఉండదు.
ఏడాదికి రెండు సినిమాలు తప్పనిసరిగా చేస్తారా? నిర్మాతగా ఫెయిల్యూర్స్ ఎదురవుతున్నాయి.. కిక్2 ఫెయిలైంది.. అసంతృప్తి అనిపించలేదా?
తప్పకుండా.. ప్రతి యేడాది రెండేసి సినిమాలు చేస్తాను. అయితే నావైపు వచ్చే కథల్ని - దర్శకుల్ని బట్టి ఉంటుంది. జయాపజయాలు ఒకటే అనిపిస్తున్నాయిప్పుడు. అందరూ ఎఫర్ట్ పెట్టి పనిచేస్తాం. కానీ కొన్నిసార్లు ఫలితాలు వేరేగా వస్తాయంతే. సక్సెస్ వచ్చినప్పుడు తక్కువ ఆలోచిస్తా. ఫెయిల్యూర్ వచ్చినప్పుడే కొంచెం ఎక్కువ ఆలోచిస్తా. తప్పుల నుంచి నేర్చుకుని పనిచేస్తాం.
ఎప్పుడూ లేనిది 'షేర్' ఆడియోలో కాస్త ఎమోషనల్ గా మాట్లాడారు?
ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. ఎక్కువ ఎమోషనల్ గా కనెక్టయి ఉంటాను. నా ఫ్యామిలీ క్యారెక్టర్ అనే దాని గురించి పాయింట్ అవుట్ చేస్తే తప్పకుండా ఎమోషన్ అవుతా. నటన పరంగా ఒక్కొక్కరిపై డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి... వాటిని పట్టించుకోను.
తమన్ గురించి?
తమన్ ఇప్పటికే ప్రూవ్డ్. జయీభవ నా రెండో సినిమా. అప్పట్నుంచి తమన్ పరిచయం. చాలా సినిమాలకు కలిసి పనిచేస్తున్నాం. క్రియేటివ్ గా సంగీతం అందిస్తున్నాడు. షేర్ కి చక్కని ట్యూన్లు ఇచ్చాడు.
ఎన్టీఆర్ హీరోగా సినిమా ఎప్పుడు?
వచ్చే ఏడాది ఉంటుంది. త్వరలోనే అధికారికంగా చెబుతాం. గ్రాండ్ ఇన్విటేషన్ ఉంటుంది.
''ఇదో చక్కని వినోదాత్మక చిత్రం. అందరికీ నచ్చుతుంది. అనవసరమైన అంచనాలు పెట్టుకోకుండా థియేటర్లకు వెళ్లి చూడండి. తప్పక నచ్చే సినిమా ఇది'' అంటూ ముగించారు కళ్యాణ్ రామ్.
నందమూరి కల్యాణ్ రామ్- సోనాల్ చౌహాన్ జంటగా మల్లికార్జున్.ఎ దర్శత్వంలో రూపొందిన ''షేర్'' ఈ నెల 30న రిలీజ్ అవుతోంది.