కళ్యాణ్‌ రామ్‌ 'డెవిల్‌' వెనుక పెద్ద వ్యూహం..!

Update: 2022-06-03 00:30 GMT
నందమూరి కళ్యాణ్ రామ్‌ హీరోగా బ్యాక్ టు బ్యాక్ ప్లాప్‌ అవుతున్నా.. నిర్మాతగా వరుసగా ప్లాప్‌ లు పడుతున్నా కూడా ప్రయత్నాలు మాత్రం వదలడం లేదు. హీరోగా ఇప్పటికే బింబిసారా చేసి ఆగస్టు లో విడుదలకు సిద్దం చేస్తున్న కళ్యాణ్‌ రామ్‌ ఆ తర్వాత డెవిల్ సినిమాను చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించాడు. ఆమద్య విడుదల అయిన డెవిల్ సినిమా ఫస్ట్‌ లుక్ మరియు గ్లిమ్స్ ఇంట్రెస్ట్‌ ను పెంచాయి.

1940 కి ముందు ఉన్న పరిస్థితులు మరియు అప్పట్లో ఇండియాలోని పరిస్థితిన డెవిల్‌ సినిమాలో చూపించబోతున్నట్లుగా కళ్యాణ్‌ రామ్‌ తన మోషన్ పోస్టర్ లో గ్లిమ్స్ లో చెప్పకనే చెప్పాడు. బింబిసార సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ కూడా దాదాపుగా పూర్తి అయ్యింది. దాంతో డెవిల్‌ సినిమా పనుల్లో హీరో కళ్యాణ్ రామ్‌ పడ్డాడు. డెవిల్‌ సినిమా గురించి మీడియాలో బయటకు రాకుండా కళ్యాణ్‌ రామ్‌ ప్లాన్‌ చేశాడు.

బింబిసార విషయంలో కూడా కళ్యాణ్ రామ్‌ లో ఫ్రొఫైల్‌ మెయింటెన్ చేశాడు. విడుదల ముందు హడావుడి చేసి విడుదల తర్వాత నిరాశ పర్చితే డిజాస్టర్ అవుతుంది. అందుకే విడుదల ముందు ప్రమోషన్స్ తో అందరి దృష్టి ఆకర్షించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అనేది కొందరి అభిప్రాయం. అందుకే డెవిల్‌ సినిమాకు కూడా అదే వ్యూహం ను అమలు చేయాలని కళ్యాణ్ రామ్‌ భావిస్తున్నాడట.

జూన్ 1 వ తారీకు నుండి డెవిల్‌ సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు మొదలు అయ్యాయి. అయినా కూడా ఆ విషయాన్ని కళ్యాణ్‌ రామ్‌ ప్రకటించలేదు. అసలు కళ్యాణ్ రామ్‌ డెవిల్ గురించి ఎలాంటి చిన్న హింట్ కూడా ఇవ్వడం లేదు. డెవిల్‌ లో కళ్యాణ్‌ రామ్‌ గెటప్ ను ఇప్పటికే రివీల్‌ చేశారు. ఆ గెటప్‌ ను చూసి చాలా మంది డెవిల్‌ లో కళ్యాణ్ రామ్‌ పాత్ర ఏమై ఉంటుంది అంటూ చర్చించుకుంటున్నారు.

మొత్తానికి బింబిసారా మరియు డెవిల్‌ సినిమాలకు పబ్లిసిటీ విషయంలో కొత్త వ్యూహాలను అమలు చేస్తున్న కళ్యాణ్ రామ్‌ కు ఎంత వరకు సక్సెస్ దక్కేను.. ఎంత వరకు ఫలితం ఉండేను అనేది చూడాలి.

భారీ అంచనాల నడుమ రూపొందిన బింబిసార సినిమా ఆగస్టు లో విడుదల అయితే డెవిల్‌ సినిమాను వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. డెవిల్‌ సినిమాకు ను భారీ బడ్జెట్‌ తో అభిషేక్‌ పిక్చర్స్ బ్యానర్‌ లో నిర్మించబోతున్నారు.
Tags:    

Similar News