కళ్యాణ్ రామ్ మళ్ళీ రిస్క్ చేస్తున్నాడా?

Update: 2019-02-28 04:24 GMT
నందమూరి కళ్యాణ్ రామ్ తాజా చిత్రం '118' మార్చ్ 1 న విడుదల కానుంది.  ఇంట్రెస్టింగ్ ప్రోమోలతో ఆడియన్స్ దృష్టిని తమ వైపు తిప్పుకున్నారు ఈ సినిమా మేకర్స్.  చాలా రోజుల నుండి కళ్యాణ్ రామ్ ఎదురు చూస్తున్న విజయం ఈ సినిమాతో దక్కుతుందని నందమూరి ఫ్యాన్స్ కూడా నమ్మకంగా ఉన్నారు.  ఈ సినిమా రిలీజ్ అయ్యేలోపే కళ్యాణ్ రామ్ మరో సినిమాను లైన్లో పెట్టాడని సమాచారం.

నందమూరి బాలకృష్ణ తో 'డిక్టేటర్' సినిమాను..  బెల్లంకొండ శ్రీనివాస్ తో 'సాక్ష్యం' మూవీని తెరకెక్కించిన శ్రీవాస్ కు కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.  ఈ సినిమాకు రైటర్ లక్ష్మీ భూపాల కథను అందిస్తున్నాడట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన క్యాస్ట్ అండ్ క్రూ ను ఫైనలైజ్ చేస్తారని.. అధికారిక ప్రకటన కూడా ఉంటుందని టాక్.  అంతా బాగానే ఉంది కానీ శ్రీవాస్ సినిమాలన్నీ కమర్షియల్ ఫార్మాట్ లో ఉంటాయి.  ఇప్పుడు ఆడియన్స్ అలాంటి మాస్ సినిమాలను పెద్దగా ఆదరించడం లేదు.  రీసెంట్ గా బోయపాటి శ్రీను - చరణ్ కాంబినేషన్లో వచ్చిన 'వినయ విధేయ రామ' రిజల్ట్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. 

 మరో వైపు శ్రీవాస్ ఫామ్ లో లేకపోవడం కూడా ఆందోళన కలిగించే అంశమే.  శ్రీవాస్ కెరీర్లో 'లౌక్యం' లాంటి హిట్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు మాత్రం ఫామ్ లో లేడు. అసలే హిట్ కోసం చాలా రోజుల నుండి ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్ ఈ పరిస్థితుల్లో శ్రీవాస్ తో చేయడం అనేది రిస్క్ అని ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తోంది.  మరి కళ్యాణ్ రామ్ - శ్రీవాస్ ప్రాజెక్ట్ ఏమౌతుందో వేచి చూడాలి. బాబాయ్ కి హిట్ ఇవ్వలేకపోయిన శ్రీవాస్ అబ్బాయికైనా హిట్ ఇస్తాడా?  
Tags:    

Similar News