కిక్‌2 ఆలస్యం వెనుక అసలు కారణం?

Update: 2015-07-08 06:10 GMT
పటాస్‌ విజయంతో ఖుషీగా ఉన్నాడు కల్యాణ్‌రామ్‌. ఆ ఒక్క హిట్టుతో చీకటి నుంచి వెలుగులోకి వచ్చాడిప్పుడు. గతాన్ని మరిపించే హిట్టించింది పటాస్‌. మరి అలాంటప్పుడు షేర్‌లా కిక్కివ్వాల్సినవాడు సైలెంటైపోయాడేంటి? అసలు కిక్‌-2 చిత్రీకరణ పూర్తయినా, ఆడియో రిలీజైనా ఎందుకు సినిమా రిలీజ్‌ తేదీ ప్రకటించడం లేదు అన్న టెన్షన్‌ అందరిలోనూ కొనసాగుతోంది. దీనికి కారణం సురేందర్‌రెడ్డితో కళ్యాణ్‌రామ్‌కి కుదరడం లేదన్నదే తాజా అప్‌డేట్‌.

కారణం ఏదైన సూరి విజువల్‌ రిచ్‌నెస్‌ కోసం యథావిధిగానే కళ్యాణ్‌రామ్‌ చేత భారీ పెట్టుబడులు పెట్టించాడు. అనుకున్నట్టే సినిమా తెరకెక్కింది. కానీ ఎందుకనో రిలీజ్‌ విషయంలో ఇంకా వేచి చూసే ధోరణి అనుసరిస్తున్నారు. ఇటు నిర్మాత కళ్యాణ్‌రామ్‌, అటు సురేందర్‌రెడ్డి రిలీజ్‌ విషయంలో ఏదీ తేల్చడం లేదు. ఇటీవలే కళ్యాణ్‌రామ్‌ పుట్టినరోజు వేడుకలోనూ ఏదీ చెప్పలేదు. ప్రశ్నించినా కళ్యాణ్‌రామ్‌ విషయం దాటవేశాడు. అంటే దర్శకనిర్మాతల మధ్య ఇంకేదో జరుగుతోంది అన్న సంకేతాలిచ్చాడు.

వేసవిలోనే వచ్చేస్తున్నాం అన్నారు. వర్షాకాలం కూడా వెళ్లిపోతోంది. అయినా ఇంకా అధికారికంగా రిలీజ్‌ గురించి ప్రకటించిందే లేదు. మామూలు బడ్జెట్‌ అనుకుంటే భారీగా పెట్టించాడని ఒకవేళ కళ్యాణ్‌రామ్‌ రుసరుస మీద ఉన్నాడేమో! అందుకే ఇలా అవుతుందేమో అని ముచ్చటించుకుంటున్నారంతా. ఇవన్నీ రూమర్లేనని కళ్యాణ్‌రామ్‌ ప్రూవ్‌ చేస్తాడేమో చూడాలి.

Tags:    

Similar News