కళ్యాణ్‌ రామ్‌ హిట్టు కొడితే కల ఫలించినట్టే

Update: 2015-08-20 22:39 GMT

2015 లో ఫస్ట్ బ్లాక్ బస్టర్... కళ్యాణ్ రామ్ పటాస్. ఈ సినిమా సూపర్ హిట్ అని డిక్లేర్ చేశాక... ఓ పేరు బాగా పాపులర్ అయింది. ఆ మూవీ ఫంక్షన్ లో ఇది నందమూరి నామ సంవత్సరం అన్నారు. తర్వాత రిలీజ్ కానున్న జూనియర్ ఎన్టీఆర్ టెంపర్, బాలకృష్ణ లయన్ షూటింగ్ చివరి దశలో ఉన్నాయపుడు. నందమూరి నామ సంవత్సరం అన్న మాట మాత్రం ఫ్యాన్స్ ని బాగా హుషారెక్కించింది.

ఆ తర్వాత టెంపర్ అంటూ బంపర్ హిట్ కొట్టాడు ఎన్టీఆర్. ముందే చెప్పి మరీ  హిట్టు కొట్టడం విశేషం. మాస్ నే లేడీస్ ని  కూడా విపరీతంగా అట్రాక్ట్ చేసింది టెంపర్. ఇది కూడా అలాంటి ఇలాంటి సక్సెస్ కాదు.. ఎన్టీఆర్ ని, ఫ్యాన్స్ ని ఫుల్ జోష్ లో ముంచేసింది. దీంతో నందమూరి నామ సంవత్సరం సెంటిమెంట్ మరింత బలపడింది.  టెంపర్ తర్వాత లయన్ అంటూ బాలయ్య వచ్చాడు సమ్మర్ లో. కానీ ఆశించిన స్థాయిలో ఆడక నిరుత్సాపరచింది ఈ మూవీ. దానితో ఆ నామ సంవత్సరం ఆనే కోరికకు ఒక టెంపరరీ బ్రేక్‌ పడిపోయింది.

ఇకపోతే.. నందమూరి నామ సంవత్సరం అనే సెంటిమెంట్ మాత్రం ఇంకా మిగిలే ఉంది. ఎందుకంటే కళ్యాణ్‌ రామ్‌ ఇంకా రెండు సినిమాలతో వస్తున్నాడు. ఒకటి ప్రొడ్యూసర్‌ గా కిక్‌ 2, రెండోది హీరోగా షేర్‌. ఇప్పుుడు కళ్యాణ్ రామ్ నిర్మాణంలో రూపొందిన కిక్2 వచ్చేస్తోంది. మరి ఈ మూవీ కూడా హిట్ అయితే... 2015 నిజంగా నందమూరి నామ సంవత్సరమే అనుకోవచ్చు. ఆ విధంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ కోరుకున్న ఆ కల ఫలించినట్టే అనుకోవచ్చు కూడా.
Tags:    

Similar News