దసరాకు ముందో రెండు పెద్ద సినిమాలు.. దసరా రోజు ఇంకో మూడు సినిమాలు.. మొత్తానికి పండగ సెలవుల అడ్వాంటేజీని ఫుల్లుగా వాడేసుకుందామని చాలా సినిమాలే బరిలో నిలిచాయి. ఐతే మంది ఎక్కువైతే మజ్జిగ పలచనైపోద్ది కదా. ఎంత పండగైనా, సెలవులైనా.. మరీ ఎక్కువ సినిమాలు పోటీలో నిలిస్తే ఏం జరుగుతుంది. ఆడియన్స్ స్ప్లిట్ అయిపోతారు. ఈ దసరాకు అదే జరిగింది. ఏ సినిమాకూ భారీ కలెక్షన్లు లేవు. అన్నీ ఓ మోస్తరు వసూళ్లతో బండి లాగిస్తున్నాయి. ఈ సంగతి ముందే గ్రహించాడు కాబట్టి.. కళ్యాణ్ రామ్ చక్కగా తన సినిమాను వాయిదా వేసుకున్నాడు. ముందు అతడి నిర్ణయం కరెక్టేనే అన్న సందేహాలు నెలకొన్నాయి కానీ.. ఇప్పుడు అందరికీ ఆ నిర్ణయమే సరైందని బోధపడుతోంది.
దసరాకు ముందు, దసరా సందర్భంగా వచ్చిన సినిమాలన్నీ వచ్చే వారానికి ఎలాగూ జోరు తగ్గించేస్తాయి. మరోవైపు ఈ వారం వేరే సినిమాలేమీ బరిలో లేవు. దీంతో సోలోగా బాక్సాఫీస్ రైడింగ్ కి రెడీ అయిపోతున్నాడు నందమూరి కథానాయకుడు. దీంతో అసలు సిసలు పండగ కళ్యాణ్ రామ్ దే అంటున్నారు సినీ జనాలు. ‘పటాస్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన సినిమా కావడంతో ‘షేర్’ మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ శుక్రవారానికి చాలా వరకు థియేటర్లు ఖాళీ అవుతాయి కాబట్టి భారీ స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి తగ్గట్లే ఓపెనింగ్స్ కూడా భారీగానే ఉండే అవకాశముంది. కలిసొస్తున్న కాలంలో కళ్యాణ్ రామ్ సినిమాకు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ రావడం లాంఛనమే అన్నట్లుంది పరిస్థితి.