పవన్ కళ్యాణ్‌ అంటే అలా ఎక్కేసింది

Update: 2018-03-21 04:41 GMT
సినిమా ఫంక్షన్స్ లో హీరోలను పేరు మార్చి సంబోధించడం అనే విషయం చాలా అరుదుగా జరుగుతుంది. అందులోను సీనియర్లు మాట్లాడేటపుడు చాలా అలర్ట్ గా ఉంటారు. కానీ పోసాని కృష్ణ మురళి లాంటి సీనియర్ నటుడు కం రైటర్.. ఎమ్మెల్యే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట జారేశాడు. నందమూరి కళ్యాణ్ రామ్ ను పవన్ కళ్యాణ్ అనేశాడు.

'కళ్యాణ్ రామ్ అమెరికాలో ఉండగా అతను హీరో కావాలని.. నేను హరికృష్ణగారు మాట్లాడుకునే వాళ్లం. అయితే అతని ఫోటోలు తెప్పించండి అని చెప్పగా.. అప్పట్లో చాలా పంపించారు. బాబు నీకు గుర్తుందా.. ఇప్పటికీ వాటిలో ఒకటి మా ఇంట్లో ఉంది. ఇంత పెద్ద బుగ్గలతో చబ్బీగా ఇంత లావు ఉండేవాడు' అంటూ కళ్యాణ్ రామ్ కెరీర్ ఆరంభాన్ని గుర్తు చేసుకున్న పోసాని.. 'ఎందుకు పవన్ కళ్యాణ్ హీరో కావాలి అని నేను కోరుకున్నానంటే.. పవన్ కళ్యాణ్.. అదే కళ్యాణ్ రామ్ ని హీరో కావాలని కోరుకున్నానంటే.. అమెరికాలో ఉద్యోగం ఉండి.. వ్యాపారాలు ఉన్నా సరే.. సినిమా ఇండస్ట్రీకి వస్తున్నాడంటే నిజాయితీ గల మనిషి. హరికృష్ణ ఎంతటి హానెస్ట్ పర్సనో.. కళ్యాణ్ రామ్ అంతే' అన్నాడు పోసాని.

తనను కళ్యాణ్ రామ్ అని కాకుండా.. పవన్ కళ్యాణ్ అని పోసాని సంబోధించిన సమయంలో నందమూరి హీరో ముఖ కవళికలు చకచకా మారిపోయాయి. ఒక క్షణం వెలుగు.. మరో క్షణం ఆశ్చర్యం.. ఆ వెంటనే ఇదేంటి అనేలా క్వశ్చన్ మార్క్.. ఇన్ని ఫీలింగ్స్ ను రెప్పపాటుల మార్చేశాడు కళ్యాణ్ రామ్. ఈ హీరో యాక్టింగ్ లో అంత ట్యాలెంట్ ఎలా చూపిస్తాడో.. ఈ రియాక్షన్ చూస్తే అర్ధమవుతుంది కదూ.
Tags:    

Similar News