మల్టీస్టారర్ సినిమాలకి తెలుగు ఇండస్ట్రీ మళ్లీ అలవాటుపడిపోయింది. ఎన్టీఆర్ - ఏఎన్నార్ కాలాన్ని గుర్తు చేస్తూ నేటి స్టార్లు కలిసి నటించేందుకు ముందుకొస్తున్నారు. వెంకటేష్-మహేష్ బాబు - వెంకటేష్ - పవన్ కళ్యాణ్ కాంబోలో సినిమాలు రావడానికి కారణం అదే. ఆ కాంబోలో సినిమాలు తెలుగు తెరకు ఫ్రెష్ నెస్ ని తీసుకొచ్చింది. అయితే చాలామంది మెగా ఫ్యామిలీ - నందమూరి ఫ్యామిలీల్లోని కథానాయకులు కలిసి నటించినప్పుడే అసలు సిసలు మల్టీస్టారర్ చూసినట్టు ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసేవాళ్లు. ఇప్పుడు ఆ ముచ్చట కూడా తీరేలా కనిపిస్తోంది.
కళ్యాణ్ రామ్ చొరవతోనే మెగా - నందమూరి కాంబో సెట్టయ్యిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలోనే ఆ కాంబో కుదిరినట్టు తెలుస్తోంది. రవికుమార్ చౌదరి చాలా రోజులుగా కళ్యాణ్ రామ్ తో సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే ఓ కథ వినిపించారట. అది కళ్యాణ్ రామ్ కి బాగా నచ్చింది. అయితే ఆ కథలో ఓ మాస్ హీరో చేయాల్సిన మరో క్యారెక్టర్ కూడా ఉందట. ఆ పాత్ర కోసం కళ్యాణ్ రామ్ స్వయంగా సాయిధరమ్ తేజ్ పేరును సూచించాడట. తేజు కూడా ఏమాత్రం నో చెప్పలేదట. అలా ఓ సూపర్ కాంబో సెట్టయ్యిందన్నమాట. కె.ఎస్.రామారావు నిర్మాణంలో ఈ చిత్రం రూపుదిద్దుకోనుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.