క‌మ‌ల్‌ హాస‌న్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్?

Update: 2015-11-04 04:31 GMT
ప్ర‌స్తుతం ఉల‌గ‌నాయ‌గ‌న్ క‌మ‌ల్‌ హాస‌న్ హైద‌రాబాద్‌ లో ఉన్నారు. హోట‌ల్ గ్రాండ్ కాక‌తీయ‌లో చీక‌టిరాజ్యం ప్ర‌మోష‌న్ కోసం మీడియా ప్ర‌తినిధుల్ని క‌లుస్తున్నారు. ఈ సంద‌ర్భంగా తెలుగువోడు డాట్‌ కాం అడిగిన ఓ ఎక్స్‌ క్లూజివ్ ప్ర‌శ్న‌కు క‌మ‌ల్ ఇంట్రెస్టింగ్ స‌మాధానం చెప్పారు. మీరు న‌ట‌న‌ - టెక్నాల‌జీపై ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ ప్రారంభిస్తున్నారు కదా? అన్న ప్ర‌శ్న‌కు...

''శిక్షణా సంస్థ ప్రారంభిస్తున్నది.. నా కోసం కూడా. ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకునేది ఉంటుంది. నేను ప్రతిరోజూ కొత్త విషయాల్ని నేర్చుకుంటూనే ఉంటాను. పెద్ద యాక్టర్‌ ఇంకేమీ తెలుసుకోనక్కర్లేదు అనుకుంటారేమో.. ప్రతి 6-7 నెలలకు ఓసారి టెక్నాలజీ మారిపోతూనే ఉంటుంది. అప్‌ డేట్‌ అవుతూనే ఉండాలి. అందుకే శిక్షణ అవసరం. ఇనిస్టిట్యూట్ అవ‌స‌రం'' అని అన్నారు.  మ‌రి క‌మ‌ల్‌ కి తెలుగులోనూ భారీగా అభిమానులు ఉన్నారు.. హైద‌రాబాద్ సినిమాతో 60-ఏళ్ల అనుబంధం ఉంది. అలాంట‌ప్పుడు తెలంగాణ రాష్ర్టం ఏపీ నుంచి విడిపోయాక ఇక్క‌డ సినిమా స్థానిక‌త కోసం - స్వ‌యం ప్ర‌తిప‌త్తి కోసం ప్ర‌య‌త్నిస్తోంది. నైజాంలోనూ ఓ ఇనిస్టిట్యూట్ పెట్టి అభివృద్ధి చేయొచ్చుక‌దా! అందుకు సీఎం కేసీఆర్‌ తో క‌మ‌ల్ ముచ్చ‌టిస్తే కాద‌ని అన‌రు క‌దా! క‌మ‌ల్ హాస‌న్ అలాంటి ప్ర‌య‌త్నం చేస్తారేమో చూడాలి.

తెలంగాణ‌లో కేసీఆర్‌ తో - ఏపీలో చంద్ర‌బాబుతో భేటీ అయ్యి ఇక్క‌డా, అక్క‌డా క‌మ‌ల్‌ హాస‌న్ ఇనిస్టిట్యూట్‌ లు పెడితే బావుంటుంది క‌దూ అంటూ ఫిలిం లవర్లు అనుకున్నా.. ఆయన మాత్రం చెన్నయ్‌ లోనే తన ఇనిస్టిట్యూట్‌ ను పెడదాం అని చూస్తున్నారట. అది సంగతి.
Tags:    

Similar News