కమల్ హాసన్ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేశారు. నిన్ననే సొంత పార్టీ పేరును కూడా ప్రకటించారు. మక్కల్ నీది మయ్యుమ్ అన్నదే కమల్ పార్టీ పేరు. ఫుల్ ప్లెడ్జెడ్ గా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. తన మూలాలు ఉన్న సినిమా రంగం నుంచి తప్పుకుంటారా అంటే.. డౌటే అంటున్నారు సన్నిహితులు. కమల్ కు నటనపై ఉన్నది అపారమైన ప్రేమ మాత్రమే కాదు.. అది ఆయన ప్రాణం. అందుకే సినిమాలను పూర్తిగా వదలకపోవచ్చని అంటున్నారు.
అలాగే శంకర్ దర్శకత్వంలో భారతీయుడు2 చిత్రం రూపొందించేందుకు బ్యాక్ గ్రౌండ్ వర్క్ జరుగుతూనే ఉందని తెలుస్తోంది. ఇందులో రీసెంట్ గా దేశీయ బ్యాంకింగ్ రంగాన్నే కుదిపేసిన నీరవ్ మోదీ స్కామ్ గురించిన ప్రస్తావన కూడా ఉండొచ్చని తెలుస్తోంది. అన్యాయాలను ఎదిరించే వ్యక్తిగా భారతీయుడు పాత్రలో 20 ఏళ్ల క్రితం కమల్ హాసన్ ఎంతగా జీవించారో తెలిసిందే. అప్పటితో పోల్చితే ఇప్పుడు కార్పొరేట్ స్కామ్స్ కౌంట్ బాగా పెరిగింది.
అందుకే తాజాగా జరిగిన కొన్ని బ్యాంకింగ్ స్కాంలను కూడా ప్రస్తావించబోతున్నారట. తనదైన శైలిలో శంకర్ ఈ నీరవ్ మోదీ స్కామ్ ను కూడా స్టోరీలో భాగంగా చెప్పబోతున్నారట. ఓ ఎపిసోడ్ అయితే.. విజయ్ మాల్యాపై కూడా ఉంటుందని అంటున్నారు. ఇటు రాజకీయంగా తనకు ఉపయోపడే విధంగా ఆయా సినిమా కథా కథనాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారట కమల్ హాసన్.