లోకనాయకుడు కమల్ హాసన్ కథానాయకుడిగా రాజేష్.ఎం.సెల్వ దర్శకత్వంలో రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ - శ్రీ గోకుళం మూవీస్ సంయుక్తంగా నిర్మించిన సినిమా 'చీకటిరాజ్యం'. త్రిష - మధుశాలిని కథానాయికలుగా నటించారు. ప్రకాష్ రాజ్ కీలకపాత్రధారి. ఈ సినిమా అక్టోబర్ 12న థియేటర్లలోకి రిలీజవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ప్రచారకార్యక్రమాల్లో పాల్గొన్న ఉలగనాయగన్ కమల్ హాసన్ తో ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇది..
చీకటిరాజ్యం .. సంగతులు?
ఓ మంచి యాక్షన్ సినిమా తీశాం. టైటిల్ లానే కథాంశం యూనిక్ గా ఉంటుంది. అడుగడుగునా ఉత్కంఠ రేకెత్తించే సినిమా ఇది. ఒక డేలో, ఒక నైట్ లో సాగే కథ. దీనిని ఫాస్ట్ ఫేస్ థ్రిల్లర్ అని అనొచ్చు.
ఇంత పెద్ద స్పాన్ ఉన్న సినిమాకి దర్శకుడిగా కొత్త కుర్రాడికి అవకాశం ఇచ్చారే?
ఒక దర్శకుడిని లేదా ఓ వ్యక్తిలోని ప్రతిభను గుర్తించడం అనేది ఓవర్ నైట్ లో జరగదు. నేను 36 సినిమాలకు పనిచేసిన తర్వాతే బాలచందర్ గుర్తించారు. బహుషా 25వ సినిమా నుంచి ఆయనకు అర్థమయ్యానేమో. ఫర్లేదు .. బాగానే చేస్తున్నావ్ అని అనడానికి అంత టైమ్ పడుతుంది. నా సినిమా దర్శకుడు రాజేష్ రాజ్ కమల్ బ్యానర్ తో చాలా కాలంగా ట్రావెల్ అవుతూ బాగానే నేర్చుకున్నాడు. ఎంబిబిఎస్ పూర్తి చేసి, డైరెక్టర్ అయ్యాడు. సినిమా కూడా ఓ సర్జన్ చేసే పనిలాంటిదే. ఆ పని విజయవంతంగా పూర్తి చేశాడు.
మీలో స్టార్ ని టెక్నీషియన్ డామినేట్ చేస్తాడని చెబుతారు?
స్టార్ అనే పిలుపు కంటే కమల్ హాసన్ అనే టెక్నీషియన్ అని పిలిపించుకోవడానికే ఇష్టపడతాను. నా యూనిట్ లో ప్రతి ఒక్కరికి సమాన ప్రాధాన్యత ఉంటుంది. నటులు - టెక్నీషియన్స్ ఆర్డర్ లో చెప్పాలంటే రాజేష్ - ఘిబ్రాన్ - కమల్ హాసన్ అనే ఆర్డర్ ని ఇష్టపడతాను.
వైవిధ్యాన్ని ఇష్టపడే నటుడు మీరు .. ఈ చిత్రంలో వైవిధ్యం ఏం ఉంది?
ఈ సినిమాలో కొత్తగా ఏం ఉంది? అని అడిగితే ఏదేదో చూపించేస్తున్నా అనే గలాటా ఉండదు. కన్ఫ్యూజన్ లేని సినిమా. మీరంతా సినిమా చూసి .. ఇది వేరేగా చేశాడు కదా అని అంటారు.
హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
ఈ సినిమాలో హీరో రోల్స్ రాయిస్ లో తిరిగే రిచ్ గయ్ కానేకాదు. ఓ మెడికల్ రెప్ లా తిరిగేస్తూ అన్నీ తెలుసుకునేవాడిగా కనిపిస్తాడు.
త్రిష గురించి?
త్రిష మా యూనిట్ కి కొత్తేమీ కాదు.. ఇప్పటికే ఓ సినిమాకి కలిసి పనిచేశాం. తను తన క్యారెక్టర్ కి రచయితగానూ కొనసాగింది. ప్రతిరోజూ తనతో కలిసి పనిచేస్తుంటే తెలిసిన స్నేహితురాలితో కలిసి పనిచేస్తున్నట్టే ఉంటుంది. ఈ సినిమాకి పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరూ అసిస్టెంట్ డైరెక్టర్లుగానే పనిచేశారు.
ఎన్నిరోజుల్లో సినిమా పూర్తి చేశారు?
ఈ సినిమాకి పనిచేసింది 54 పని దినాలు. అందులోనే తెలుగు వెర్షన్ - తమిళ వెర్షన్ రెండూ షూట్ చేశాం. భాషని బట్టి సెట్‌లో బోలెడన్ని మార్పులు, చేర్పులు చేశాం. ఒక్కో వెర్షన్ కి 30రోజులు పనిచేశాం అనుకోవచ్చు.
తెలుగులో రిలీజ్ చేయాలనుకోవడానికి కారణం?
స్టార్ గా నా జన్మభూమి ఇది. పెద్ద స్టార్ గా సీడ్ వేసింది ఆంధ్రానే. మరో చరిత్ర తర్వాత ఇక్కడ ప్రేక్షకుల అభిమానం మర్చిపోలేక ప్రతిసారీ ఇక్కడికొస్తూనే ఉన్నా.