20 ఏళ్ల కిందట కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. సౌత్ సినిమా సత్తా ఏంటో దేశం మొత్తానికి తెలిసేలా చేసిందా చిత్రం. కమల్-శంకర్ కాంబినేషన్లో మళ్లీ ఓ సినిమా రావాలని అప్పట్నుంచి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ అది సెట్టవ్వలేదు. ఎట్టకేలకు ఇన్నేళ్ల తర్వాత వీరి కలయికలో ‘భారతీయుడు’ సీక్వెల్ ను అనౌన్స్ చేయడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. కానీ ఈ సినిమా గురించి ప్రకటన వచ్చి దాదాపు ఏడాది కావస్తోంది కానీ.. ఇప్పటిదాకా సినిమా మొదలే కాలేదు. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చిన దిల్ రాజు తర్వాత తప్పుకున్నాడు. ఆపై శంకర్ తో ‘2.0’ తీస్తున్న లైకా ప్రొడక్షన్స్ వాళ్లే ఈ సినిమాను కూడా ప్రొడ్యూస్ చేస్తారని అన్నారు. తాజాగా అజయ్ దేవగణ్ ను ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకు ఎంచుకున్నట్లు వార్తలొచ్చాయి.
దీంతో ఇక ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లడమే తరువాయి అని అంతా అనుకుంటుండగా.. కమల్ హాసన్ పెద్ద షాకే ఇచ్చాడు. ‘విశ్వరూపం-2’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసి ఆయన్ని అజయ్ దేవగణ్ ఎంపిక గురించి అడిగితే.. తనకేమీ తెలియదనేశాడు. దీని గురించి తనకు సమాచారం లేదన్నాడు. అంతకుమించి ఏమీ మాట్లాడలేదు. నిజానికి కమల్ ఈ ఏడాది ప్రథమార్ధంలోనే ‘భారతీయుడు-2’ మొదలుపెట్టాలని శంకర్ కు షరతు పెట్టినట్లు సమాచారం. ‘విశ్వరూపం-2’ పనుల్ని కొన్ని నెలల ముందే ముగించి ‘భారతీయుడు-2’ కోసం రెడీ అయ్యాడాయన.
రాజకీయాలు-అవినీతి నేపథ్యంలో సాగే సినిమా కావడంతో వచ్చే ఏడాది ఎన్నికల కంటే ముందు దీన్ని రిలీజ్ చేస్తే బాగుంటుందన్నది కమల్ ఆలోచన. కానీ ‘2.0’ సంగతి ఎటూ తేలక శంకర్ అందులోనే మునిగిపోవడంతో ఇటు వైపు చూడలేదు. ఒక సినిమా పూర్తి కాకుండా ఇంకో సినిమాలోకి వెళ్లడు శంకర్. ఇలా ‘భారతీయుడు-2’ ఆలస్యమైంది. ఐతే ఇప్పటికే రాజకీయాల్లో అడుగుపెట్టిన కమల్.. ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచే రాజకీయ కార్యకలాపాల్లో బిజీ కావాలనుకుంటున్నాడు. శంకర్ ప్రణాళికల ప్రకారం ఈ ఏడాది చివరికే ‘భారతీయుడు-2’ మొదలయ్యేలా ఉంది. అప్పుడు మొదలుపెడితే ఎన్నికల సమయానికి సినిమా రెడీ చేయడం కష్టమే. కమల్ ఈ సినిమాకు అంకితం అయిపోతే.. రాజకీయాలు కష్టమైపోతాయి. ఈ నేపథ్యంలో కమల్ ఈ చిత్రంపై అనాసక్తితో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అజయ్ గురించి అడిగితే అలా స్పందించినట్లు తెలుస్తోంది. కమల్ కాదంటే విక్రమ్ లేదా అర్జున్ హీరోగా శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని చూస్తున్నట్లు సమాచారం.