ఇప్పటికే అఖిల్ కు దారివ్వడానికి కోన వెంకట్ ప్రొడ్యూస్ చేసిన 'శంకరాభరణం' సినిమాను నవంబర్ 20 నుండి పోస్టుపోన్ చేశారు. కోన కామెడీ చేశాడని అనుకున్నా.. లేకపోతే జెన్యూన్ గానే అఖిల్ కు ఎందుకులే పోటీ అనుకున్నా.. ఈ వివి వినాయక్ సినిమాకు మాటలు రాసింది తానే కాబట్టి.. తన సినిమాకు తానే పోటీగా మరో సినిమాను పెట్టడం సమంజసం కాదు. అందుకే మనోడు సినిమాను పోస్టుపోన్ చేశాడు.
ఇకపోతే అఖిల్ కూడా అందిరికీ పోటీగా మారాలని.. ట్రైనింగ్ తీసుకుని మరీ బరిలోకి దిగడం చూస్తే తనకు ముచ్చటేస్తోందని ఆడియో రిలీజ్ నాడు వీడియో మెసేజ్ తో శుభాకాంక్షలు తెలియజేశాడు లెజండరీ హీరో కమల్ హాసన్. ఈయన ఇప్పుడు అఖిల్ కోసం మరో ఫేవర్ చేస్తున్నారు. తన ''చీకటి రాజ్యం'' సినిమాను నిజానికి ముందుగానే నవంబర్ 12న ఫిక్సు చేశారు. ఈ సినిమా తమిళ వర్షెన్ తూంగవనం యాజిటీజ్ గా అదే తేదీన వస్తున్నా కూడా.. తెలుగు వర్షన్ ను మాత్రం అఖిల్ కోసం 20 వ తారీఖుకు పోస్టుపోన్ చేశారట. ఆ విధంగా అఖిల్ కు ఇది మరో హెల్ప్ అవుతుంది మరి.
నిజానికి ఒకవేళ అఖిల్ సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయినా కూడా.. 45 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ ను రికవర్ చేయాలంటే.. షుమారు 2 వారాలు సింపుల్ గా కావల్సిందే. రెండు వారాలు ధాటిగా రన్ అయ్యి.. ఆ తరువాత మరో వారం కూడా హ్యాపీగా రన్ అయితేనే అంత మొత్తం వసూలు అవుతుంది. సో.. వీళ్ళందరూ తమ సినిమాలు వెనక్కి జరిపేసి అఖిల్ కు మేలే చేస్తున్నారు.