బాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా మరియు కియారా అద్వానీ జంటగా తెరకెక్కిన షేర్షా ఇటీవలే అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమాకు విష్ణు వర్థన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విడుదల అయినప్పటి నుండి ఎంతో మంది ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తూనే వస్తున్నారు. ఈ సినిమా లో చూపించిన దేశ భక్తి మరియు ఇండియన్ ఆర్మీ గొప్పతనంకు ప్రతి ఒక్క భారతీయుడి ఒల్లు పులకరిస్తుంది అంటూ రివ్యూలు దక్కించుకున్న షేర్షాకు తాజాగా యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ నుండి ప్రశంసలు దక్కాయి.
ట్విట్టర్ లో షేర్షా గురించి కమల్ హాసన్ స్పందించాడు. చిన్నప్పటి నుండి సినిమాలు అంటే చాలా ఇష్టం.. ఒక దేశ భక్తుడి కొడుకుగా సినిమాల్లో ఇండియన్ ఆర్మీ గురించిన చూపించే విషయమై నాకు విభిన్నమైన ఆలోచన ఉంది. కాని షేర్షా మాత్రం నా హృదయం ఉప్పొంగేంత ఉద్వేగాన్ని కలిగించింది. భారత సైనికుల యొక్క గొప్పతనంను చూపించారు. విష్ణు వర్థన్ వంటి ట్యాలెంటెడ్ డైరెక్టర్ ను ప్రోత్సహించినందుకు ధర్మ ప్రొడక్షన్స్ కు కృతజ్ఞతలు. సిద్దార్థ్ మల్హోత్రా మరియు కియారా అద్వానీలకు కంగ్రాట్స్. అద్బుతమైన మీ పనితనంకు అభినందనలు అంటూ ట్వీట్ చేశాడు.
ఇండియన్ ఆర్మీ నేపథ్యంలో షేర్షా సాగుతుంది. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు కాస్త కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి అద్బుతమైన కథనంగా తీసిన దర్శకుడు విష్ణువర్థన్ ప్రతి ఒక్క ఇండియన్ సినీ ప్రేక్షకుడిని కదిలించేలా సినిమాను తెరకెక్కించాడు అనడంలో సందేహం లేదు. విక్రమ్ బాత్రా పాత్రలో సిద్దార్థ్ మల్హోత్రాను చూపించిన తీరు అద్బుతం అంటూ విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. సినిమాలో యుద్ద సన్నివేశాలు మొదలుకుని హీరో చనిపోయే ఎమోషనల్ సన్నివేశాల వరకు ప్రతి ఒక్కటి కూడా అద్బుతంగా వచ్చాయంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా థియేటర్లలో విడుదల అయ్యి ఉంటే వందల కోట్ల సినిమా అయ్య ఉండేది అంటూ కూడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.