లోకనాయకుడు కమల్ హాసన్ విశ్వరూపం 2 సందడి మరీ ఎక్కువగా కనిపించడం లేదు. విడుదల సమయానికి హైప్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుందని అభిమానులు ధీమాగా ఉన్నారు. అదే పనిగా కమల్ దీని ప్రమోషన్ కోసం హైదరాబాద్ లో ఈవెంట్ చేయటం ఒక ఎత్తైతే బిగ్ బాస్ షోకు అతిధిగా రావడం మరో ట్విస్టు. తమిళ్ లో తాను హోస్ట్ చేసే షో అయినప్పటికీ తెలుగులో కనిపించాలి అన్న రూల్ ఏమి లేదు. కానీ తన సినిమా విడుదల దగ్గరగా ఉన్న నేపధ్యంలో తనకూ హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో కమల్ అందులో మెరిశాడు. నిజానికి ఈ మాత్రం కూడా కమల్ హాసన్ తమిళ్ వెర్షన్ కు చేయటం లేదు. దానికి కారణాలు లేకపోలేదు. మొదటి భాగం అక్కడ కంటే ఇక్కడ పెద్ద హిట్టయ్యింది. ముందు విడుదల కావడం ఒక రీజన్ అయితే ఆదరణ విషయంలో కూడా మనవాళ్ళు తేడాని వసూళ్ల రూపంలో చూపించారు. సహజంగానే కమల్ ప్రమోషన్ కోసం ఎక్కువ ఫోకస్ ఇక్కడే పెట్టాడు.
పేరుకి సీక్వెల్ అయినప్పటికీ ఇది కమల్ ఫస్ట్ పార్ట్ తో సమాంతరంగా తీసాడు. ఆ విషయం ఆయనే ఒప్పుకున్నాడు కూడా. సో దానికి కంటిన్యూగా ఇండియాలో జరిగిన విధంగా కథను చూపబోతున్నారు. ఆగస్ట్ 10న విడుదల కానున్న విశ్వరూపం 2కి పోటీ ముందు రోజు వస్తున్న శ్రీనివాస కళ్యాణం. దాని టాక్ రిపోర్ట్స్ అన్ని 9వ తేదీ మధ్యానానికే వచ్చేస్తాయి కాబట్టి విశ్వరూపం 2 దానికి తగ్గ ఏర్పాటుతో రెడీగా ఉండొచ్చు. కమల్ ప్రత్యేక ఆసక్తికి కారణం తన సినిమాల్లోని వైవిధ్యాన్ని తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించడం. ఇప్పుడే కాదు ఇరవై ఏళ్ళ క్రితమే భారతీయుడు-భామనే సత్యభామనే లాంటి సినిమాలు తమిళనాడు కంటే తెలుగు రాష్ట్రాల్లోనే భారీ వసూళ్లు తీసుకొచ్చాయి. కొన్ని చోట్ల వంద రోజులు కూడా ఆడాయి. అందుకే విశ్వరూపం 2 విషయంలో మొదట సైలెంట్ గా ఉన్నా లాస్ట్ స్టేజి లో ప్రమోషన్ భుజాల మీద వేసుకున్నాడు కమల్. మరి ఆయన అంచనా నెరవేరుతుందో లేదో మరొక్క వారంల్లో తెలిసిపోతుంది.