సారి ఫ్యాన్స్‌.. రెండు సాధ్యం కావడం లేదు

Update: 2019-04-04 12:52 GMT
యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ క్రియాశీలక రాజకీయాల్లోకి ఎంటర్‌ అయిన విషయం తెల్సిందే. పార్టీ పెట్టి ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో తన పార్టీ తరపున అభ్యర్థులను కూడా కమల్‌ పోటీకి దించుతున్నాడు. తమిళనాడులోని ఖాళీ ఉన్న అసెంబ్లీ నియోజక వర్గాల్లో మరియు పార్లమెంటు నియోజక వర్గాల్లో కమల్‌ తన పార్టీ అభ్యర్థులను నిలబెట్టి వారి తరపున ప్రచారం చేస్తున్నాడు. కమల్‌ పోటీ చేయకున్నా ఆయన పార్టీ కోసం చాలా కష్టపడుతున్నాడు. ఈ సమయంలోనే భారతీయుడు 2 చిత్రంకు బ్రేక్‌ ఇచ్చాడు.

రెండు దశాబ్దాల క్రితం శంకర్‌, కమల్‌ ల కాంబినేషన్‌ లో వచ్చిన 'భారతీయుడు' చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌ గా భారతీయుడు 2 చిత్రం తెరకెక్కుతుంది. ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ కూడా పూర్తి అయ్యింది. అయితే రాజకీయాల్లో బిజీగా ఉంటున్న కారణంగా కమల్‌ హాసన్‌ 'భారతీయుడు 2' చిత్రంకు శంకర్‌ అడిగిన డేట్లు ఇవ్వలేక పోతున్నాడు. రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి రావడంతో పాటు, ఇతరత్ర కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతోంది.

ఇలాంటి నేపథ్యంలో కమల్‌ హాసన్‌ సినిమాలకు గుడ్‌ బై చెప్పాలని నిర్ణయానికి వచ్చినట్లుగా తాజాగా మరోసారి ప్రకటించాడు. ప్రజలు నన్ను రాజకీయ నాయకుడిగా, వారికి సేవ చేయాలని కోరుకుంటున్నారు. అందుకే ఫ్యాన్స్‌ కు సారీ చెప్పి సినిమాల నుండి తప్పుకోవాలని భావిస్తున్నాను. కొందరు ఫ్యాన్స్‌ నన్ను రాజకీయ నాయకుడిగా చూడాలనుకుంటున్నారు, మరి కొందరు నా సినిమాలు కోరుకుంటున్నారు, రాజకీయ నాయకుడిగా కొనసాగుతూ హీరోగా చేయడం సాధ్యం అవ్వడం లేదు. అందుకే హీరోగా తన కెరీర్‌ కు ఫుల్‌ స్టాప్‌ పెట్టాలని భావిస్తున్నట్లుగా కమల్‌ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కమల్‌ వ్యాఖ్యలు ప్రస్తుతం ఆయన అభిమానులకు నిరాశ కలిగిస్తున్నాయి.

Tags:    

Similar News