కమల్ సినిమాలంటే ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో ముడిపడి ఉంటాయి. ఆయన సినిమాలు మధ్యలో ఆగిపోవడం.. రిలీజ్ విషయంలో ఇబ్బందులు ఎదురవడం.. విడుదలయ్యాక కూడా ఏదో ఒక సమస్య రావడం.. మామూలే. ముఖ్యంగా ఆయన సినిమాలకు సెన్సార్ వాళ్ల నుంచి అభ్యంతరాలు ఎదురవుతుంటాయి. వాళ్లు చెప్పే అభ్యంతరాలపై మండిపడుతుంటాడు కమల్. సెన్సార్ వాళ్లు సినిమాల గొంతు కోసేస్తుంటారని గతంలో ఆయన అన్న సంగతి గుర్తుండే ఉంటుంది. తాజాగా మరోసారి సెన్సార్ వాళ్లపై సెటైర్ వేశాడు కమల్.
కమల్ సినిమాల్లో లిప్ లాక్స్ చాలా కామన్. 90ల్లోనే పెదవి ముద్దులతో మోత పుట్టించాడాయన. తాజాగా ‘చీకటి రాజ్యం’ సినిమాలోనూ లిప్ లాక్స్ ఉన్నాయి. దీని గురించి కమల్ ను అడిగితే.. ‘‘ఇప్పటి వరకైతే సినిమాలో పెదవి ముద్దులున్నాయి. పోస్టర్ పైన కూడా కనిపించాయి. కానీ సినిమా విడుదలైనపుడు ఉంటాయో లేదో మరి. సెన్సార్ వాళ్లు ఏం చేస్తారో తెలియదు కదా’’ అంటూ సెటైరిక్ గా మాట్లాడాడు కమల్. ఆయన ఉద్దేశం ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇక సినిమాల విషయంలో వివాదాలు రేపే వాళ్ల మీద కమల్ విమర్శలు గుప్పించాడు. తాను వాస్తవాల్ని చూపించాలనుకుంటాను తప్పితే.. ఏ మతాన్ని కించపరచాలని అనుకోనని కమల్ చెప్పాడు. ‘‘నేను దేవుణ్ని నమ్మను కానీ.. అన్ని మతాల్ని గౌరవిస్తా. కళాకారులకు కులం, మతం ఉండదు. నాకు గుల్జార్ అనగానే ఆయన కవిత్వం గుర్తుకొస్తుంది తప్పితే ఆయన ముస్లిం అన్నది జ్నప్తికి రాదు. బాలచందర్ అంటే ఆయన సినిమాల గురించి చెప్పుకుంటాం కానీ.. ఆయన కులం గురించి కాదు’’ అని కమల్ అన్నాడు.