లెజెండ్ బాల‌చంద‌ర్ విగ్రహావిష్క‌ర‌ణ‌కు మెగాస్టార్?

Update: 2019-10-31 16:06 GMT
విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ జీవితం అంతా ప‌రిశ్ర‌మ‌కే అంకిత‌మిచ్చిన సంగ‌తి తెలిసిందే. బాల‌న‌టుడిగా ఐదేళ్ల వ‌య‌సులోనే కెరీర్ ఆరంభించి అంచెలంచెలుగా స్టార్ హీరోగా ఎదిగారు. విశ్వ‌న‌టుడిగా అసాధార‌ణ ప్ర‌తిభ‌తో వెలిగిపోయాడు. అత‌డి జీవితంలో మెజారిటీ భాగం సినిమాతోనే. న‌ట‌న‌-ద‌ర్శ‌క‌త్వం-ర‌చ‌న స‌హా ఇక్క‌డ అన్ని శాఖ‌ల్లోనూ ఆయ‌న ప్ర‌తిభ చూపారు. అందుకే ఆయ‌న సేవ‌ల్ని పుర‌స్క‌రించుకుని ఈసారి బ‌ర్త్ డేని స్పెష‌ల్ గా సెల‌బ్రేట్ చేస్తున్నారు.

అర‌వై ఐకానిక్ ఇయ‌ర్స్ ని పూర్తి చేసుకున్న ఆయ‌న న‌వంబ‌ర్ 7న ఇండ‌స్ట్రీ కెరీర్ ప‌రంగా 60వ బ‌ర్త్ డేని.. త‌న లైఫ్ ప‌రంగా 65వ బ‌ర్త్ డేని జ‌రుపుకోనున్నారు. ఇండ‌స్ట్రీలో ఆయ‌న‌కు ష‌ష్ఠిపూర్తి సెల‌బ్రేష‌న్ అని అనాలేమో. అందుకే ఈ స్పెష‌ల్ బ‌ర్త్ డేకి ఘ‌న‌మైన ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇప్ప‌టికే ఉల‌గ‌నాయ‌గ‌న్ ఫ్యాన్స్ ఊరూ వాడా సంబ‌రాల‌కు ఏర్పాట్లు చేశారు. న‌వంబ‌ర్ 7న క‌మ‌ల్ హాస‌న్ రెండు విగ్ర‌హాల్ని ఆవిష్క‌రించ‌నున్నారు. అందులో ఒక‌టి త‌న తండ్రి గారైన డి.శ్రీ‌నివాస‌న్ విగ్ర‌హాన్ని త‌న స్వ‌స్థ‌లం అయిన ప‌ర‌మ‌కుడి లో ఆవిష్క‌రిస్తారు. అలాగే త‌న న‌ట‌గురువు అయిన లెజెండ‌రీ ద‌ర్శ‌కుడు కీ.శే బాల‌చంద‌ర్ విగ్ర‌హాన్ని చెన్న‌య్ టీటీకే రోడ్ లో ఆవిష్క‌రించ‌నున్నారు.

ది గ్రేట్ డైరెక్ట‌ర్ బాల‌చంద‌ర్ కేవ‌లం క‌మ‌ల్ హాస‌న్ కే కాదు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ - మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోల‌కు గురువు కాబ‌ట్టి ఈ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు ఆ ఇద్ద‌రూ ఎటెండ‌య్యే అవకాశం ఉంద‌ని భావిస్తున్నారు. ఇక క‌మ‌ల్ హాస‌న్ పుట్టిన‌రోజు సంబ‌రాలు ఇంత స్పెష‌ల్ గా ప్లాన్ చేసినందుకు తంబీల్లో ఒక‌టే ఉత్సాహం వెల్లివిరుస్తోంది. మూడు రోజుల పాటు ఈ సంబ‌రాలు జ‌ర‌గ‌నున్నాయి.

Tags:    

Similar News