క‌మ‌ల్ సినిమాకి కొత్త క్రేజ్

Update: 2015-11-13 07:48 GMT
చాలా రోజుల త‌ర్వాత క‌మ‌ల్ హాస‌న్ నేరుగా తెలుగులో ఓ సినిమా చేశాడు. అదే... చీక‌టిరాజ్యం. యూనివ‌ర్స‌ల్ స‌బ్జెక్ట్ కావ‌డంతో తెలివిగా ఇటు తెలుగులోనూ, అటు త‌మిళంలోనూ  తీశాడు. తెలుగులో స్ట్రెయిట్‌ గా చేయ‌డానికి కూడా ఇదే స‌రైన స‌బ్జెక్ట్ అని క‌మ‌ల్ భావించ‌డంతో చీక‌టిరాజ్యం తెర‌కెక్కింది.

క‌మ‌ల్‌ లాంటి క‌థానాయ‌కుడు చాలా రోజుల త‌ర్వాత తెలుగులో ఓ సినిమా చేస్తున్నాడంటే ఆటోమేటిక్‌ గా క్రేజ్ పెరుగుతుంది. అందుకే  చీక‌టి రాజ్యం మొద‌లైన‌ప్ప‌ట్నుంచే ఆ సినిమాకి ఇండ‌స్ట్రీలోనూ, అటు ప్రేక్ష‌కుల్లోనూ మంచి బ‌జ్జే క్రియేట్ అయ్యింది. కానీ తెలుగులో ఆ సినిమాని అనుకొన్న స‌మ‌యానికి విడుద‌ల చేయ‌లేక‌పోయాడు క‌మ‌ల్‌. దీపావ‌ళికి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌నుకొన్నాడు కానీ... ఆ రోజు అఖిల్ విడుద‌ల కావ‌డం, మంచి థియేట‌ర్ల‌న్నీ బ్లాక్ అవ్వ‌డంతో చీక‌టిరాజ్యంని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డం కుద‌ర్లేదు. అయితే త‌మిళంలో మాత్రం అనుకొన్న‌ట్టుగానే విడుద‌ల చేశాడు.

నిజానికి అదొక పెద్ద సాహ‌స‌మనే చెప్పాలి. త‌మిళంలో రిజ‌ల్ట్ ఏమాత్రం అటు ఇటు అయినా తెలుగులో క్రియేట్ అయిన బ‌జ్ మొత్తం ప‌డిపోతుంది. కానీ క‌మ‌ల్ మాత్రం సినిమాపై గ‌ట్టి న‌మ్మ‌కంతో విడుద‌ల చేశాడు. చివ‌రికి ఆయ‌న న‌మ్మ‌క‌మే నిజ‌మైంది. ఊహించిన‌ట్టుగానే సినిమాకి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో ఆ ప్ర‌భావం తెలుగుపైనా ప‌డింది. తమిళ్  రిపోర్ట్స్ పాజిటివ్‌ గా ఉండ‌టంతో సినిమాకి కొత్త బ‌జ్జ్ క్రియేట్ అయ్యింది. ఆ బ‌జ్‌ ని ప‌క్కాగా క్యాష్ చేసుకోవాల‌న్న ఆలోచ‌న‌లో క‌మ‌ల్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. హైద‌రాబాద్‌ లోనే ఉంటూ సినిమా విడుద‌ల‌య్యేవ‌ర‌కు బ‌లంగా ప్ర‌మోష‌న్ చేసుకోవాల‌న్న ప్ర‌య‌త్నంలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. సినిమా విడుద‌ల‌కు ముందు రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రీమియ‌ర్ షోల‌ను ఏర్పాటు చేయ‌బోతున్నారు.
Tags:    

Similar News