ఉలగనాయగన్ కమల్ హాసన్ నటించిన `విశ్వరూపం 2` ఇటీవలే రిలీజైన సంగతి తెలిసిందే. తెలుగు - తమిళ్ - హిందీ భాషల్లో ఈ సినిమా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజైంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని వెర్షన్లు రిలీజయ్యాయి. అయితే ఈ సినిమా ఓపెనింగులు ఎలా ఉన్నాయి? ఇప్పటివరకూ అందిన వార్తల ప్రకారం అసలు రిజల్ట్ ఏంటి? అనేది విశ్లేషిస్తే.. ఈ సినిమా కొందరికి మోదం - కొందరికి ఖేదం! అన్న తీరుగా వసూళ్లు సాధిస్తోందని రిపోర్ట్ అందింది.
ప్రఖ్యాత ఆంగ్ల వెబ్ సైట్ కథనం ప్రకారం.. `విశ్వరూపం 2` తమిళ్ లో హిట్టు. అక్కడ ఉలగనాయగన్ కమల్ హాసన్ కి ఉన్న క్రేజు - ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా ఈ సినిమా చక్కని వసూళ్లు సాధిస్తోంది. కేవలం తొలి రెండ్రోజుల్లో 20కోట్లు వసూలు చేసింది. మునుముందు ఫర్వాలేదనిపించే వసూళ్లు చేస్తోంది. ఇక తెలుగు - హిందీలోనూ కమల్ హాసన్ క్రేజుతో పంపిణీదారులు పెద్ద మొత్తంలోనే పెట్టుబడులు పెట్టారు. అయితే ఇప్పటికే హిందీలో చెత్త రివ్యూల కారణంగా డిజాస్టర్ అన్న టాక్ వచ్చేసింది. అక్కడ పంపిణీదారులకు 25-30 కోట్ల మేర నష్టం తప్పేట్టు లేదని తెలుస్తోంది. అలానే తెలుగులో విశ్వరూపం వసూళ్లు సోసోనే అని చెబుతున్నారు.
వశీం అహ్మద్ కశ్మీరీ అనే ఆర్మీ అధికారి `రా ఏజెంట్`గా మారి ఏం చేశాడు? అన్నదానిని `విశ్వరూపం 2` చిత్రంలో చూపించారు కమల్ హాసన్. విశ్వరూపం రిలీజైన ఐదేళ్లకు ఈ సినిమా రిలీజైంది. 2013లో రిలీజైన విశ్వరూపం -1 కమల్‌హాసన్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. గ్రిప్పింగ్ స్పై థ్రిల్లర్ గా పార్ట్ 1 మెప్పించింది. ఆ విజయం వల్లనే ఇప్పుడు పార్ట్ 2కి హైప్ క్రియేట్ చేయగలిగారు. ఇక్కడో ఆసక్తికర విషయం ఏమంటే.. పార్ట్ 1 తెరకెక్కించినప్పుడే కమల్ హాసన్ పార్ట్ 2 మెజారిటీ భాగం చిత్రీకరించామని తెలిపారు. అంటే పార్ట్ 1 బడ్జెట్లోనే ఇది తెరకెక్కింది. ఆ తర్వాత బ్యాలెన్స్ షూట్ కోసం అదనంగా ఖర్చయింది. దీనిని బట్టి ఈ సినిమా వల్ల కమల్‌హాసన్‌కి ఏ నష్టం లేదు. భారీ మొత్తాలకు అమ్మేశారు కాబట్టి పంపిణీదారుల వరకూ నష్టాలు తప్పదని అర్థమవుతోంది.