విశ్వనటుడు కమల్‌హాసన్ ఏం చేసినా సంచలనమే. ప్రస్తుతం అతడు నటించిన ఉత్తమ విలన్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఏప్రిల్ 10 రిలీజ్ తేదీని ప్రకటిస్తూ నిన్నటిరోజున హైదరాబాద్‌లో ముచ్చటించారాయన. ఉత్తమ విలన్ చిత్రంలో నా గురువు బాలచందర్ నటించారు. ఆయన లేనిదే ఈ సినిమా లేదు. నేను నటించేవాడినే కాదేమో! బాలచందర్‌తో నా అనుబంధం వేరు. 16 వయసు నుంచి ఆయనతోనే ఉన్నా. దాదాపు 36 సినిమాల్లో నటించాను. అంతటి సుదీర్ఘ అనుబంధం మాది. బాలచందర్, కె.విశ్వనాథ్ ఇద్దరినీ నేను గురువులుగా భావిస్తాను. ఉత్తమవిలన్ చిత్రంలో నటించమని ఆయన్ని అడిగినప్పుడు ఒక మాట అన్నారు. ఒకవేళ ప్రాజెక్టు మొదలై మధ్యలోనే నేను చనిపోతే ఏం చేస్తావు? అని అడిగారు. ఒకవేళ అలా జరిగితే స్క్రిప్టు మార్చుకుంటా అని చెప్పాను. అయితే ఆయన నా సినిమా పూర్తి చేసి ఇహలోకాన్ని వీడి వెళ్లారు.. అని కమల్‌హాన్ చెప్పారు. ఈ సినిమా మేకప్ కోసం ఎంతో తీవ్రంగా శ్రమించాం. రోజూ రెండున్నర గంటలు అదే పని. శ్రమ ఫలించింది. యూనివర్శిటీలో చదువుకున్నప్పుడు రమేష్ అరవింద్ నాకు స్నేహితుడు. అందుకే తనకి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చాను.. అని చెప్పారు కమల్.