విలక్షణ నటుడు కమల్ హాసన్ ముందు ఏ నటుడైనా తేలిపోవాల్సిందే. తెర మీద ఆయన్ని డామినేట్ చేసే నటులు చాలా కొద్దిమందే ఉంటారు. తన కొత్త సినిమాకు అలాంటి నటుణ్నే తీసుకున్నాడు కమల్ హాసన్. బాలీవుడ్ గ్రేట్ ఆర్టిస్ట్ పరేష్ రావల్ ను తన తర్వాతి సినిమాలో ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నాడు కమల్ హాసన్.
తన మిత్రుడు, మలయాళ సీనియర్ డైరెక్టర్ రాజీవ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే కొత్త సినిమాలో పరేష్ రావల్ కు చోటు కల్పించాడు కమల్. వీళ్లిద్దరూ తెరమీద కనిపిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ సినిమాకు రాజీవ్ తో కలిసి కమల్ స్క్రిప్టు సమకూర్చడం విశేషం. శ్రుతి హాసన్ తొలిసారి కమల్ తో కలిసి నటిస్తున్న సినిమా ఇది. ఇందులో వాళ్లిద్దరూ తండ్రీ కూతుళ్లుగా నటిస్తుండటం విశేషం. ఇందులో సీనియర్ నటి రమ్యకృష్ణ కమల్ భార్య పాత్రలో కనిపించబోతోంది. వీళ్లిద్దరూ కలిసి గతంలో ‘పంచతంత్రం’ సినిమా చేసిన సంగతి తెలిసిందే.
‘చీకటి రాజ్యం’ తర్వాత కమల్ చేస్తున్న సినిమా ఇది. నిజానికి రాజీవ్ దర్శకత్వంలో ‘అమ్మా నాన్న ఆట’ అనే సినిమాను అనౌన్స్ చేశాడు కమల్. ఇందులో అమల కూడా ఓ కీలక పాత్ర పోషించాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టుకు వెళ్లిపోయి.. ఇప్పుడనుకుంటున్న కొత్త సినిమా వచ్చింది. ఈ నెలాఖరులో సెట్స్ మీదికి వెళ్లనున్న ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకొస్తుంది.